Guppedantha Manasu November 28 Today Episode: ఈ రోజు ఎపిసోడ్ లో మహేంద్ర చిత్రాని వీల్ చైర్ లో అక్కడికి తీసుకురావడంతో ఆమె తల్లి తండ్రులు ఒక్కసారిగా షాక్ అవుతారు. వీడియో కాల్ లో చిత్రాను చూసి దేవయాని కూడా షాక్ అవుతుంది. అప్పుడు ఈ అమ్మాయిని రాక్షసుల బారి నుంచి తప్పించుకుని తీసుకురావడానికి కొంచెం లేట్ అయింది అని అంటాడు. అమ్మ చిత్ర ఇక్కడ అందరికీ నిజాలు తెలియాలి ఆ నిజాలు నీ నోటి నుంచి చెప్పమ్మా అని అంటాడు మహేంద్ర. చెప్పమ్మా నువ్వు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు సూసైడ్ చేసుకోవడానికి కారణం వసుధార మేడం నా అలా అని ఎవరు చెప్పారు సార్ అని అంటుంది. మరి సూసైడ్ లెటర్ ఎందుకు రాసావ్ అమ్మ అంటూ ఆ లెటర్ ని చిత్రకు ఇవ్వడంతో అసలు ఈ సూసైడ్ లెటర్ నిన్ను రాయలేదు సార్ అని అంటుంది చిత్ర.

చిత్ర మాటలకు షాక్ అయిన వసుధార రిషి

సంతకం నీదేకదమ్మా అనడతో సంతకం నాదే కానీ లెటర్ మాత్రం నేను రాయలేదు అని అంటుంది చిత్ర. మరి సూసైడ్ ఎందుకు చేసుకున్నావు అని ఎస్ఐ అడగడంతో అసలు నేను సూసైడ్ చేసుకోలేదు అనగా అక్కడ ఉన్న వారందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అప్పుడు చిత్ర వాళ్ళ అమ్మ చిత్ర దగ్గరికి వచ్చి ఎందుకమ్మా అబద్దాలు చెబుతున్నావు నువ్వు వాసవ్ ప్రేమించుకున్నారు కదా ఈ మేడమే మిమ్మల్ని బెదిరించింది కదా అనడంతో ఎందుకు అబద్ధాలు చెబుతున్నారు అని అంటుంది. అక్కడ జరుగుతున్నదంతా దేవయాని వీడియో కాల్ లో చూసి ఆశ్చర్యపోతుంది. అప్పుడు పోలీసు ఇక్కడ ఏం జరుగుతోంది నువ్వు చెప్పేది ఒకలా ఉంది మీరు చెప్పేది ఒకలా ఉంది సిసి ఫుటేజ్ లో మరొకలా ఉంది అని అంటాడు.

అసలు నిజం చెప్పిన చిత్ర

మొత్తం చెప్పమ్మా నాకు అయోమయంగా ఉంది అని పోలీస్ అడగడంతోచిత్ర జరిగింది మొత్తం వివరించడంతో చిత్ర తల్లిదండ్రులు పోలీసులు ఒక్కసారిగా షాక్ అవుతారు. మీ వెనక నేను ఉన్నాము భయపడొద్దు అనడంతో మరి మీ తల్లిదండ్రులు ఎందుకు అబద్ధాలు చెబుతారు అమ్మ అనగా అసలు వాళ్ళ నా తల్లిదండ్రులే కాదు అని అంటుంది చిత్ర. మా అమ్మ అన్న చిన్నప్పుడే చనిపోయారు. అప్పటి నుంచి వీళ్ల దగ్గరే ఉన్నాను వీళ్ళు ఎన్ని కష్టాలు పెట్టినా కూడా భరించాను. కానీ ఈసారి మాత్రం నా ప్రాణాలు తీయాలని చూసారు అనడంతో అప్పుడు చిత్ర వాళ్ళ పిన్ని ఏమీ తెలియనట్టుగా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అసలు ఏం జరిగింది అని నాటకాలు ఆడుతూ ఉంటుంది. నా కూతురు ఇలా మారిపోవడానికి వీళ్ళే కిడ్నాప్ చేసి బెదిరించారు అని అంటుంది.

భయంతో వణికిపోతున్న దేవయాని

అప్పుడు పోలీస్ చిత్ర చెప్పింది మాకు అబద్ధంలా కనిపిస్తోంది. మా దగ్గర బలంగా సాక్షదారాలు ఉన్నాయి అనడంతో వెంటనే చిత్ర చెప్పింది అబద్ధమని అనుకున్నాము కానీ దాని నిజమని నేను రుజువు చేస్తాను అని అంటాడు. ముందు సాక్షాలు చూపించండి అనగా అప్పుడు రిషి తన కారులో ఉన్న వాసవ్ ని అక్కడికి పిలుచుకొని వస్తాడు. అప్పుడు వాసవ్ ని చూసి చిత్రా వాళ్ళ బాబాయ్ పిన్ని ఇద్దరూ భయపడుతూ ఉంటారు. అప్పుడు రిషి ఎందుకురా నైట్ చిత్రాన్ని చంపాలి అనుకున్నావు అనడంతో ఆ మాటలు విన్న దేవయాని వెంటనే ఈ విషయాన్ని శైలేంద్రకు ఫోన్ చేసి చెప్పాలి కొడుకు ఫోన్ చేయగా కొడుకు ఫోన్ పని చేయదు. దాంతో దేవయాని టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు రిషి చిత్రను చంపాలి అనుకున్నవా లేదా చెప్పు అనడంతో నిజమే సార్ నేను చంపాలనుకున్నాను అనడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.

అప్పుడు చిత్ర వాళ్ళ పిన్నమ్మ అతను అబద్ధం చెబుతున్నాడు అని బుఖాయించడంతో నేను సాక్ష్యం చూపిస్తాను అని అంటాడు రిషి. రిషి వీడియో చూపించడంతో పోలీసులు ఒక్కసారిగా షాక్ అవుతారు. పోలీసులు కోపంగా వాసవ్ దగ్గరికి వెళ్లి ఎందుకురా ఇట్లా అబద్దాలు చెప్పావు అని నిలదీస్తారు. దీని వెనుక మరొక వ్యక్తి ఉన్నారు అనడంతో ఎవరు లేరు సార్ నేనే కావాలనే చేశాను అనగా అబద్ధాలు చెప్పకు నిజం చెప్పు అని అంటాడు రిషి. అప్పుడు దేవయాని టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు వాసవ్ నిజం మొత్తం చెప్పేస్తాడు. అప్పుడు నీ వెనకాల ఎవడు ఉన్నాడు. ఎవడు వాడు నిజం చెప్పు అని రిషి నిలదీస్తూ ఉంటాడు. నీకు వాడు ఎవడో తెలుసు మర్యాదగా నిజం చెప్తావా చెప్పవా అని అడుగుతాడు రిషి. సరే వాడు ఎవడో నీకు తెలియదు అనుకుందాము కానీ వాడి పేరు మాత్రం నీకు తెలుసు చెప్తావా లేదా అని అంటాడు రిషి.

Guppedantha Manasu November 28 Today Episode: వాసవ్ చేత నిజం చెప్పించిన రిషి

ఇప్పుడు కనుక నువ్వు నిజం చెప్పకపోతే నా చేతిలో నీకు టార్చర్ మామూలుగా ఉండదు అని అంటాడు రిషి. అప్పుడు నేను నిజం చెప్పేస్తాను సార్ అని భయపడుతూ చెబుతాడు వాసవ్. అప్పుడు దేవయాని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఎమ్మెస్సార్ అని అబద్ధం చెప్పడంతో రిషి వాళ్ళు షాక్ అవుతారు. మాటలకు దేవయాని ఆశ్చర్య పోతుంది. అప్పుడు పోలీసులు అతని మీద కంప్లైంట్ ఇవ్వండి అనడంతో ఇప్పుడు అవసరం లేదు సార్ తన గురించి నేను చూసుకుంటాను అని అంటాడు రిషి. అప్పుడు రిషి పోలీస్ వాళ్ళతో మాట్లాడుతూ నేను మొదటినుంచి నా భార్య తప్పు చేయలేదని చెప్పాను కానీ మీరే తనని నిందించారు ఎప్పుడు ఇలా ఆలోచించకండి అని అంటాడు రిషి. మా కేసులో జరిగినట్టు ఇకమీదట ఏ కేసులో జరగకుండా చూసుకోండి అని అంటాడు. అప్పుడు చిత్ర పిన్ని బాబాయ్ వాసవ్ లను పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్తారు. అప్పుడు అందరూ కలిసి చిత్రకు ధైర్యం చెబుతూ మేము మీ వెనుక ఉన్నాము భయపడకు అని చెబుతారు. చాలా థాంక్స్ సార్ అని చిత్రా చెప్పడంతో నాకు థాంక్స్ వద్దు నువ్వు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలి అని అంటాడు రిషి. మరొకవైపు దేవయాని టెన్షన్ పడుతుండగా శైలేంద్ర ధరణితో ఏకాంతంగా గడుపుతూ ఉంటాడు.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

AkashavaniEditor

Hai I'm Akashavani, Film Journalist. I breathe and live entertainment. I love to watch serials and films from childhood-now I get paid for it. I worked in a few top media houses such as News18 Telugu,...

Mail

Published on నవంబర్ 28, 2023 at 7:16 ఉద.