Guppedantha Manasu November 29 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో వసుధార ఏడుస్తూ ఉండగా ఎందుకు ఏడుస్తున్నావ్ వసుధార ప్రాబ్లం సాల్వ్ అయ్యింది కదా ఇంకా ఎందుకు బాధపడుతున్నావు అనడంతో వసుధార రిషి చేతికి ముద్దు పెడుతుంది. ఇప్పుడు నాకు చాలా రిలీఫ్ గా ఉంది సార్. అది మాటల్లో చెప్పలేను సార్ అని అంటుంది. అయినా మీరు ఆ సమయంలో అంత కూల్ గా ఎలా ఉన్నారు. నావల్ల చిత్ర సూసైడ్ చేసుకుందని వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. సీసీటీవీ ఫుటేజ్ కూడా అలాగే ఉంది. మీడియా వాళ్ళు అడిగే ప్రశ్నలకు నా దగ్గర సమాధానాలు ఉన్నా కూడా వాళ్లు నా మాట వినడం లేదు. వాళ్ళవైపు వాళ్ళు పక్కాగా ఆధారాలు సృష్టించుకొని నన్ను కావాలని ఇరికించారు సార్ అని అంటుంది. అప్పుడు వసుధర ఏడుస్తుండగా మధ్య మధ్యలో రిషి చిన్న చిన్నగా జోకులు వేసి నవ్విస్తాడు.

వసుధారకి ధైర్యం చెప్పిన రిషి

కానీ వసుధార మాత్రం బాధతో మాట్లాడుతూనే ఉంటుంది. అప్పుడు రిషి వసుధారని కూల్ చేసి నార్మల్ గా మాట్లాడేలా చేస్తాడు. నీకెందుకు భయం నేను పక్కన ఉండగా నిన్ను ఎవరు వేలెత్తి చూపించలేరు అని వసుధారకీ ధైర్యం చెబుతాడు రిషి. ఆ తరువాత మహేంద్ర అనుపమకి ఫోన్ చేసి ఒకసారి ఇంటికి రావాలి ఇప్పుడే రావాలి అనడంతో సరే అని అంటుంది అనుపమ. తర్వాత వసుధార రిషి కార్ లో వెళ్తుండగా వసుధార వాసవ్ అన్న మాటలు గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఏమి ఆలోచిస్తున్నావ్ వసుధార అని రిషి అడగగా ఈ ప్లాన్ మొత్తం ఎమ్మెస్సార్ చేశాడని అతను చెప్పాడు. కానీ ఎమ్మెస్సార్ కి అన్ని తెలివితేటలు లేవు అనడంతో రిషి ఆలోచనలో పడతాడు.

సంతోషంలో వసుధార రిషి

ఆ తర్వాత వసు, రిషి టీ కొట్టు దగ్గర టీ తాగుతూ ఉంటారు. అప్పుడు ఇద్దరు కలిసి ప్రేమగా కబుర్లు చెప్పుకుంటూ ఉండగా అప్పుడు టీ కొట్టు అతను టీ లేటుగా పెట్టడంతో అయ్యే పని కాదు అని వసుధారనే స్వయంగా వెళ్లి టీ కొట్టులో పని చేసి రిషి కోసం ప్రేమగా టీ పెడుతుంది. అప్పుడు టీ కొట్టు అతనికి టీ ఎలా చేయాలో నేర్పిస్తూ ఉంటుంది. అప్పుడు వసుధార చేసిన టీని ఆ టి కొట్టు అతను కూడా తాగి సూపర్ గా ఉంది మేడంతో రిషి నువ్వుతు ఉంటాడు. అప్పుడు టీ కొట్టు అతను రిషి దగ్గరికి వెళ్లి మీతో ఒక సెల్ఫీ కావాలి సార్ మీరు చాలా గొప్పవారు చాలా మంచి వ్యక్తి అని రిషిని తెగ పొగుడుతూ ఉండగా వసుధార సంతోష పడుతూ ఉంటుంది. మీరంటే మాకు పిల్లలకు చాలా ఇష్టం మీతో సెల్ఫీ దిగితే వాళ్ళు చాలా సంతోషపడతారు అనడంతో అంతేనా లేకపోతే టీ కొట్టు ముందే ఫ్లెక్సీ ఏమైనా కడతారా ఆడంతో ఈ ప్లాన్ ఏదో బాగుంది మేడం అని అంటాడు.

కోడలి విషయంలో గర్వంగా ఫీల్ అవుతున్న మహేంద్ర

అలా చేయకండి మీరు టీ బాగా చేస్తే మీ దగ్గరికి వచ్చి తాగుతారు అంతేకానీ ఇలా ఎప్పుడు చేయకండి అని రిషి వసుధార ఆ టీ కొట్టు అతనితో కలిసి సెల్ఫీ దిగుతారు. ఆ తర్వాత మహేంద్ర ప్రేమగా అనుపమ కోసం టీ తీసుకుని రావడంతో ఇదేంటి కొత్తగా అనగా ఏం రాఘవ అని అంటాడు మహేంద్ర. ఎందుకు సడన్ గా రమ్మని పిలిచావు మహేంద్ర అనగా నా కోడలు చిత్ర కేసులో నిర్దోషి అని తేలింది. నేను మొదటి నుంచి చెబుతున్నా కూడా నువ్వు నా మాట వినిపించుకోలేదు. వసుధార జగతి శిష్యురాలు. అలాగే నీకు థాంక్స్ చెప్పడానికి కూడా పిలిపించాను నువ్వు వసుధారని బయటకు తీసుకురావడం వల్ల రిషి ఈ కేసులో బాగా తెలివిగా ఆలోచించాడు అని అంటాడు మహేంద్ర. రిషి అక్కడికి వచ్చి వచ్చారా మేడం మేమే మీకు కాల్ చేద్దాం అనుకున్నాము.

అనుపమ మాటలకు ఆశ్చర్యపోయిన రిషి

చిత్ర కేసులో ఫ్రాడ్ ఎవరో తెలిసిపోయింది అని అంటాడు రిషి. వసుధార నిర్దోషి తనేం తప్పు చేయలేదు అని సంతోషంగా చెబుతాడు రిషి. నీ భార్య తప్పు చేయలేదని వెంటనే నిరూపించుకున్నావు కానీ మీ అమ్మను చంపిన వాళ్ళు ఎందుకు పట్టుకోలేకపోతున్నావు అనడంతో వసుధార వాళ్ళు షాక్ అవుతారు. ఆ ప్రయత్నంలో ఉన్నాను మేడం అనడంతో ప్రయత్నంలో ఉంటే మరి కేసు కొలిక్కి కూడా రాలేదు కదా. కనీసం అనుమానంగా కూడా ఎవరిని పట్టుకోలేదు అనడంతో నిదానంగా జరుగుతుందిలే అనుపమ అని అంటాడు మహేంద్ర. భార్య విషయంలో అంత చురుగ్గా ఉన్నది రిషి అమ్మ విషయంలో మాత్రం ఎందుకు అంత చురుగ్గా లేడు అనడంతో మాటలకు వాళ్లు ఆశ్చర్యపోతారు. నీ కోడలు గెలిచింది నిర్దోషిని అని నాకు సంతోషంగా ఫోన్ చేసి ఇంటికి పిలిపించి చెప్పావే మరి నీ భార్యని చంపిన వాళ్ళను ఎందుకు పట్టుకోలేకపోతున్నావు అని మహేంద్రని నిలదీస్తుంది.

Guppedantha Manasu November 29 Today Episode: నేరస్తులను పట్టుకుంటాను అంటున్న రిషి

మేడం మీకు తెలియకుండా మాట్లాడకండి నేను మా అమ్మ విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నానో కానీ సరైన క్లూ లు దొరకడం లేదు అని అంటాడు రిషి. నిన్ను ఈ స్థాయిలో ఉంచిన జగతి కోసం ఈ మాత్రం హెల్ప్ చేయలేవా, తనని చంపిన వాళ్ళని తెలుసుకోలేవా అని వసుధారని నిలదీస్తుంది. అప్పుడు రిషి కోప్పడుతూ మేడం మీరు మా అమ్మ విషయంలో నేను ఏమి చేయలేదని మీరు అపోహ పడుతున్నారు. నేను బయటికి కనిపించినంతగా లోలోపల ఎంత బాధ పడుతున్నానో నాకు మాత్రమే తెలుసు అని అంటాడు రిషి. మా అమ్మను చంపిన వాళ్ళు ఎప్పుడు ఒకసారి పట్టుకుంటాను అది రేపు కావచ్చు ఎల్లుండి కావచ్చు కానీ పట్టుకొని తీరుతాను అని అంటాడు రిషి.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

AkashavaniEditor

Hai I'm Akashavani, Film Journalist. I breathe and live entertainment. I love to watch serials and films from childhood-now I get paid for it. I worked in a few top media houses such as News18 Telugu,...

Mail

Published on నవంబర్ 29, 2023 at 6:53 ఉద.