Guppedantha Manasu November 30 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో దేవయాని టెన్షన్ గా శైలేంద్రకు ఫోన్ చేయగా ధరణి ఫోన్ లిఫ్ట్ చేసి యోగక్షేమాలు అడగడంతో ముందు శైలేంద్రకు ఫోన్ ఇవ్వు అని అంటుంది దేవయాని. కానీ ధరణి మాత్రం ఫోన్ ఇవ్వకుండా పనిమనిషి పనికి రోజు వస్తుందా మీకు కాఫీ టీలు ఇస్తుందా అని అడుగుతూ ఉంటుంది. ఏంటి అత్తయ్య గారు నేను ఎన్ని ప్రశ్నలు వేసినా మీరేం మాట్లాడరు అని అంటుంది ధరణి. ఇంతలో శైలేంద్ర అక్కడికి వచ్చి ఫోన్ తీసుకుంటాడు. ఏంటి మామ్ ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు అసలు దాని కేసులో ఇరికించింది. ఎమ్మెస్సార్ కదా అనడంతో నీకెలా తెలుసు అనడంతో ఈ కథను అల్లింది నేను కాబట్టి మరి నాకు తెలియకుండా ఎలా ఉంటుంది అని సంతోషంతో మాట్లాడుతాడు శైలేంద్ర.

దేవయానికి ధైర్యం చెప్పిన శైలేంద్ర

ఆ ఎంఎస్ఆర్ పేరు చెప్పమని చెప్పి చాలా మంచి పని చేశావు లేదంటే ఈ పాటికి మన పనులు అయిపోయేవి అని భయపడుతూ మాట్లాడుతుంది దేవయాని. నువ్వేం టెన్షన్ పడకు ధైర్యంగా ఉండు అక్కడ ఎప్పుడెప్పుడు ఏమేం జరగాలో నేను ప్లాన్ చేసి వచ్చాను అని అంటాడు శైలేంద్ర. మరోవైపు రిషి అనుపమ అన్న మాటల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో వసుధార పిలవడంతో కిచెన్ లోకి వెళ్తాడు. ఎందుకు పిలిచావు వసుధార అని అడగగా ఏమీ లేదు సార్ మీరు భోజనం సరిగా చేయలేదు కదా అలాగే పడుకుంటే మళ్ళీ ఆరోగ్యం దెబ్బతింటుంది అనడంతో అప్పుడు రిషి ప్రేమగా వసుధార వైపు అలాగే చూస్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళిద్దరూ ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు ఇద్దరు ఒకరికొకరు వసుధార చేసిన పదార్థాన్ని తినిపించుకుంటూ ఉంటారు.

వసు రిషి మధ్య రొమాంటిక్ సీన్.

అప్పుడు వసుధార పెదవులపై అంటిన ఆహారాన్ని చేతులతో తీయడంతో ఇద్దరు రొమాంటిక్ గా ఒకరి వైపు ఒకరు అలాగే చూసుకుంటూ ఉంటారు. అప్పుడు రిషి వసుధారకు ముద్దు పెట్టబోతుండగా ఇంతలో ముకుల్ ఫోన్ చేసి ఒక వాయిస్ ని ట్రేస్ అవుట్ చేసాము ఆ వాయిస్ ఎవరిదో మీరు కనుక్కోవాలి మీరందరూ ఉండాలి అనడంతో సరే రేపు మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో కలుద్దాము అని అంటాడు రిషి. మరొకవైపు శైలేంద్ర ఇంట్లో అందరూ ముకుల్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడు దేవయాని తెగ టెన్షన్ పడుతూ ఉంటుంది. టెన్షన్ తట్టుకోలేక అసలు ఏంటి రిషి అతను ఏం చెప్పాడు అనడంతో ఏదో వాయిస్ అని చెప్పాడు పెద్దమ్మ ఆ వాయిస్ ఎవరిదో మనం గుర్తుపట్టాలి అన్నాడు అనడంతో దేవయాని మరింత టెన్షన్ పడుతూ ఉంటుంది.

ముకుల్ ని చూసి భయపడుతున్న దేవయాని

ఇంతలోనే ముకుల్ అక్కడికి వస్తాడు. మేము చాలా ప్రయత్నాలు చేయగా ఒక్క చిన్న క్లూ దొరికింది అనడంతో దేవయాని షాక్ అవుతుంది. అప్పుడు అందరూ ముకుల్ చెప్పేది చాలా జాగ్రత్తగా వింటూ అతను ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అప్పుడు ముకుల్ అందరి ముందు వాయిస్ ని ప్లే చేస్తాడు. ఇప్పుడు అందులో శైలేంద్ర ఇద్దరిని కలిపి చంపేయ్ అని రౌడీతో మాట్లాడుతుండగా ఆ వాయిస్ విన్న దేవయానితో పాటు అక్కడున్న అందరూ షాక్ అవుతారు. అప్పుడు శైలేంద్ర వాయిస్ విని అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. విన్నారు కదా సార్ ఈ వాయిస్ ఎవరిదో గుర్తుపట్టారా అని ముకుల్ అడగడంతో నా కొడుకుది అని అంటాడు ఫణింద్ర. అప్పుడు కొడుకు వాయిస్ అవడంతో పాటు ఎమోషనల్ అవుతూ ఉంటాడు. రిషి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు.

Guppedantha Manasu November 30 Today Episode: నిజం తెలుసుకొని షాక్ అయిన రిషి

అప్పుడు దేవయాని మాత్రం అది నా కొడుకు వాయిస్ కాదు అని అందరితో వాదిస్తూ ఉంటుంది. దేవయాని మాటలకు వసుధార మహేంద్ర ఇద్దరు కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇది మిమిక్రీ చేసి ఉంటారు మార్ఫింగ్ చేసి ఉంటారు అని కొడుకుని సేవ్ చేయడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటుంది. నేను మీ అబ్బాయిని అదుపులోకి తీసుకొని ఇంట్రాగేట్ చేస్తాము అనడంతో నేను ఒప్పుకోను అంటూ గట్టిగట్టిగా అరుస్తూ ఉంటుంది దేవయాని. నా కొడుకుని దోషిని చేస్తున్నావా అంటూ కొడుకుది తప్పు ఏం లేదు అన్నట్టుగా మాట్లాడుతుంది దేవయాని. అలా మౌనంగా ఉన్నావేంటి రిషి ఇదంతా అబద్ధమని కొట్టి పారేయ్ అని తెగ టెన్షన్ పడుతూ మాట్లాడుతుంది.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

AkashavaniEditor

Hai I'm Akashavani, Film Journalist. I breathe and live entertainment. I love to watch serials and films from childhood-now I get paid for it. I worked in a few top media houses such as News18 Telugu,...

Mail

Published on నవంబర్ 30, 2023 at 7:04 ఉద.