Guppedantha Manasu November 7 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో రిషి వసుధార మహేంద్ర దగ్గరికి రాగా కాలేజీకి వెళ్తున్నారా రిషి అనడంతో అవును కానీ మన కాలేజీకి కాదు విష్ కాలేజీకి అనడంతో ఆ కాలేజీకి ఎందుకు రిషి అనగా ఏంటి మామయ్య మాకు ఆ కాలేజీకి సంబంధం లేదు అన్నట్టుగా మాట్లాడుతారు ఎంతైనా మేము ఓల్డ్ లెక్చర్స్ కదా అనగా అలానే కాదు సడన్గా ఎందుకని అనడంతో ఏం లేదు డాడ్ వాళ్లు మమ్మల్ని ఇన్వైట్ చేశారు మాతో పాటు మీరు కూడా రావాలి వెళ్లి రెడీ అవ్వండి అని అంటాడు రిషి. నేను రాను మీరు మాత్రమే వెళ్ళండి అనడంతో లేదు మావయ్య మీరు కూడా రావాలి అని వసుధార అనగానే బలవంత పెట్టకండి మీరు వెళ్ళండి. నేను తాగుతానని భయపడుతున్నాను కదా అలాంటిదేమీ లేదు మీరు క్షేమంగా వెళ్లి రండి అని అంటాడు మహేంద్ర.
ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన ముకుల్
ఇప్పుడు కూడా నేను మీకు మాటిస్తున్న రిషి నువ్వు వచ్చేవరకు నేను జగతితోనే ఉంటాను అని అంటాడు మహేంద్ర. తర్వాత వసుధార నేను ఒకటి అడుగుతాను కాదనకండి మేము విష్ కాలేజీకి వెళ్తున్నాం కదా మీరు డిబిఎస్టి కాలేజీ కి వెళ్ళాలి అనడంతో మహేంద్ర షాక్ అవుతాడు. నేను రాలేను అక్కడికొస్తే జగతి జ్ఞాపకాలు నాకు గుర్తుకు వస్తాయి అనడంతో సరే వసుధార ఈ విషయంలో డాడీని ఇబ్బంది పెట్టకు వెళ్ళొస్తాం అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతారు. మరొకవైపు ముకుల్ జగతిని చంపిన ప్లేస్ కి వెళ్లి అన్ని విషయాలు పాండియన్ ని అడిగి తెలుసుకుంటుండగా ఇంతలో అక్కడికి రిషి,వసు వస్తారు. చెప్పండి సార్ నేను అనగా ఆరోజు ఏం జరిగిందో చెప్పండి అనగా అప్పుడు రిషి జరిగిన విషయాలు అన్నీ ముకుల్ కి చెబుతాడు.
సరికొత్త ప్లాన్ వేసిన శైలేంద్ర
ఆ రోజు మీ అమ్మగారు మీకు ఏం చెప్పాలని వచ్చారు అనడంతో ఇంతక ముందు నా మీద ఎటాక్స్ జరిగాయి కదా ఆ విషయం గురించి మాట్లాడడానికి వచ్చారని నేను అనుకుంటున్నాను అని అంటాడు రిషి. అప్పుడు మళ్లీ రిషి జరిగిన విషయాలను చెబుతూ ఎమోషనల్ అవుతాడు. తర్వాత ముకుల్ రౌడీ చంపిన ప్రదేశానికి వెళ్లి అన్ని పరిశీలిస్తుండగా ఇంతలో శైలేంద్ర మనిషి శైలేంద్ర కు ఫోన్ చేసి ముకుల్ ఒక కదలికను చెబుతూ ఉంటాడు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ శైలేంద్రని పట్టుకోలేరు ఈ కేసుకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని మట్టిలో కలిపేశాను అని అనుకుంటూ ఉంటాడు. తర్వాత ముకుల్ అక్కడికి వెళ్లి ఆ షూటర్ మీరు వచ్చిన తర్వాతే వచ్చాడు. సీసీ కెమెరాని పరిశీలించాము బైక్ నెంబర్ ద్వారా అతని అడ్రస్ కూడా కనుక్కున్నాము అని అంటాడు.
నిజాలు రాబట్టే ప్రయత్నంలో ముకుల్
అతను మొబైల్ నెంబర్ డేటా ని కనుక్కొనే ప్రయత్నంలో ఉన్నాము. మీ అమ్మగారిని చంపిన వ్యక్తి ఎవరో కానీ చాలా ప్లాన్డ్ గా ఉన్నాడు ప్రతిదీ చాలా జాగ్రత్తగా చేశాడు అనడంతో రిషి వసుధార షాక్ అవుతారు. తప్పకుండా పట్టుకోవాలి అన్నంతో సరే అని అంటాడు ముకుల్. ఆ తర్వాత రిషి, వసు విష్ కాలేజ్ కి వెళ్తారు. అప్పుడు వాళ్లు రిషి, వసుల జంట ను గురించి పోగుడుతూ వాళ్లకు గ్రాండ్గా వెల్కం చెబుతారు. ఇంతలోనే అక్కడకు ఏంజెల్ విశ్వనాథం వస్తారు. అప్పుడు వాళ్ళిద్దర్నీ చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు. అప్పుడు వసుధార మెడలో తాళిని చూసి ఏంజెల్ షాక్ అవుతుంది. బాగున్నావా ఏంజెల్ అనడంతో బాగాలేను ఏంటి రిషి ఇది అనడంతో అప్పుడు విశ్వనాథం ఆపి ఇంటికి వెళ్లి మాట్లాడదాం ఇక్కడ ఏ విషయాలు మాట్లాడకు అని అంటాడు.
Guppedantha Manasu November 7 Today Episode: అసలు విషయం తెలిసి షాక్ అయినా ఏంజెల్
అప్పుడు ఏంజెల్ వసు రిషి ల వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. అప్పుడు కాలేజీ ప్రిన్సిపల్ రిషి వసు వచ్చిన తర్వాత కాలేజ్ బాగా డెవలప్ అయ్యిందని ఆ విషయాలు చెబుతుండగా రిషి దంపతులు మాత్రం ఏంజెల్ వైపు చూసి ఏం మాట్లాడకుండా మౌనంగా తల దించుకుంటారు. తర్వాత కాలేజీ స్టాఫ్ అందరు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో ఏంజెల్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత అనుపమ ఒక ఇంటికి వెళుతుంది.