Guppedantha Manasu October 17 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో రిషి తండ్రిని చూసి బాధపడుతూ ఉండగా వసుధార బాధపడకండి సార్ అని ఓదారుస్తూ ఉంటుంది. అప్పుడు రిషి డాడ్ ని ఈ పరిస్థితులలో చూడలేకపోతున్నాను వసుధార అంటూ మరింత బాధపడుతూ ఉంటాడు. అప్పుడు వసుధార నేను తప్పు చేశాను అనగా మీరు తప్పు చేయడం ఏంటి సార్ అనడంతో డాడ్ కి వాళ్ళ అన్నయ్య అంటే ప్రాణం. పెదనాన్నకి అలాగే ఇంటికి దూరం చేశాను కదా అని అంటాడు రిషి. మీరు చేసిన తప్పు కాదు అక్కడ మహేంద్ర సార్ వాళ్ళ గొడవలు జరగకూడదని మంచి ఉద్దేశంతోనే ఇక్కడికి పిలుచుకొని వచ్చారు మీరు తప్పు చేయలేదు అంటూ రిషికి ధైర్యం చెబుతూ ఉంటుంది.
వసుని చూసి కుళ్ళుకుంటున్న శైలేంద్ర
తర్వాత వసు కాఫీ చేస్తుండగా రిషి అక్కడికి వెళ్లి హెల్ప్ చేయాలా అని అడగగా వద్దులేండి సార్ అని అంటుంది. ఆ తర్వాత కాఫీ ఇవ్వడంతో రిషిని కాఫీని కప్పు సాసర్లో పోసి ఇద్దరూ తాగుతూ ఉంటారు. అప్పుడు వాళ్లు సరదాగా మాట్లాడుకుంటూ కాఫీ తాగుతూ ఉంటారు. అప్పుడు రిషి జగతి జ్ఞాపకాలు గుర్తుతెచ్చుకుంటాడు. అప్పుడు రిషి వసుధారని కాలేజీకి వెళ్లమని చెప్పి ఎండిగా బాధ్యతలు స్వీకరించమని చెబుతాడు. కాలేజీని ఇంతకుముందు లాగే నడిపిస్తూ ముందుకు తీసుకెళ్లాలి అని చెబుతాడు. మీరు రారా సార్ అనగా ఈరోజుకు వస్తాను అనడంతో వసుధార సంతోష పడుతూ ఉంటుంది. ఆ తరువాత రిషి దేవయాని శైలేంద్ర తో మాట్లాడుతూ అందరూ సంతకం చేశారు మీరిద్దరూ కూడా సంతకం చేస్తే తాను ఎండీ గా బాధ్యతలు స్వీకరిస్తుంది అని అంటాడు.
వసుధారకు ధైర్యం చెప్పిన రిషి..
అప్పుడు తల్లి కొడుకులు ఇద్దరు ఇష్టం లేకపోయినా బలవంతంగా ఫైల్ లో సంతకం చేస్తారు. అందరూ నిన్ను ఎండిగా అంగీకరించారు నువ్వు కూడా ఎండీగా బాధ్యతలు స్వీకరిస్తున్నట్లు సంతకం చెయ్యి అని అనడంతో శైలేంద్ర లోలోపల కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అప్పుడు వసుధార సంతకం పెట్టడానికి ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకు ఆలోచిస్తున్నావు వసు అనగా ఒకప్పుడు నేను జగతి మేడం వల్ల ఈ కాలేజీలోకి అడుగు పెట్టాను అలాంటిది ఈరోజు ఏకంగా ఎండిగా బాధ్యతలు తీసుకోబోతున్నాను అనడంతో రిషి ఏం కాదులే వసుధార అవన్నీ పట్టించుకోకు ముందు సంతకం పెట్టు అని అంటాడు. కష్ట కాలంలో ముందుండి ధైర్యంగా ఈ కాలేజీలు నడిపించారు.
నేను మేడం అంత ధైర్యంగా ఉండలేకపోవచ్చు కానీ మేడం స్ఫూర్తితో ఈ కాలేజీలో ముందుకు నడిపిస్తాను అని అంటుంది. అప్పుడు రిషి కూడా వసుధార కు కొన్ని మాటలు చెప్పి ధైర్యం చెబుతూ ఉంటాడు. అప్పుడు వసుధార ఏమీ ఆలోచించకుండా సంతకం చేయడంతో శైలేంద్రా లో లోపల కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఆ తర్వాత దేవయాని శైలేంద్ర అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత నేను ఒక పని చేస్తాను సార్ మీరు కాదనకుండా నాకు మాట ఇవ్వాలి అని అనడంతో సరే అని వసు కు మాట ఇస్తాడు రిషి. అప్పుడు రిషిని వసుధార ఎండి సీట్లో కూర్చోబెట్టి నిజానికి ఇది మీరు కూర్చోవాల్సిన సీట్ ఇది మీ సీట్ అని అంటుంది. అప్పుడు ఇద్దరు మీరు గొప్ప అంటే నువ్వు గొప్ప అన్నట్టుగా సరదాగా నవ్వుతూ వాదించుకుంటూ ఉంటారు.
Guppedantha Manasu October 17 Today Episode: రిషిని ఎండి స్థానంలో కూర్చోమన్న వసుధార..
ఎప్పటికైనా మీరు ఈ కుర్చీలో కూర్చోవాలి నీ పక్కన నేను కూర్చోవాలి అనడంతో రిషి నవ్వుతూ ఉంటాడు. ఎప్పటికైనా మీరు ఈ ఎండి బాధ్యతను చేపట్టాలి అది నా కల సార్ అని అంటుంది వసు. అప్పుడు వసు నవ్వడంతో ఎందుకు నవ్వుతున్నావు అనగా ఒకప్పుడు మీరు ఎండిగా ఉన్నప్పుడు లోపలికి అడిగి వచ్చేదాన్ని ఆ విషయాలు గుర్తుకొచ్చి నవ్వుతున్నాను అని అంటుంది. అప్పుడు రిషి జగతి వైపు చూసి చూసావా అమ్మ నీ కోడలు నీ శిష్యురాలు పాత విషయాలు అన్నీ గుర్తు తెచ్చుకొని నాపై పగ తీర్చుకోవాలనుకుంటుంది అని సరదాగా మాట్లాడుతాడు. అప్పుడు వసు,రిషి ఇద్దరు కలిసి జగతి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు.