Guppedantha Manasu October 28 Today Episode: ఈ రోజు ఎపిసోడ్ లో మహేంద్ర ఒక చోట కూర్చొని అనుపమ అన్న మాటల గురించి ఆలోచిస్తూ ఉండగా ఇంతలో అక్కడికి వసుధార మజ్జిగ తీసుకొని వస్తుంది. మీరు భోజనం చేశారా అమ్మ అనడంతో తిన్నాము మామయ్య మరి మీరు అనగా నేను చాలా రోజుల తర్వాత మా ఫ్రెండ్ కలవడంతో అక్కడికి వెళ్లి తనతో పాటు తినొచ్చాను అని అంటాడు. చాలా రోజులు కాదు చాలా ఏళ్లయింది అనగా మీ ఫ్రెండ్ నాకు తెలుసా మామయ్య అనడంతో లేదమ్మా రిషికి కూడా తెలియదు. రిషి పుట్టిన తర్వాత ఎప్పుడు మన ఇంటికి రాలేదు. మనకు బాగా కావాల్సిన ఆత్మీయులు అని అంటాడు.
శైలేంద్రకు వార్నింగ్ ఇచ్చిన వసుధార
ఆ విషయాలన్నీ మళ్ళీ ఒకసారి సమయం వచ్చినప్పుడు చెప్తాను అనడంతో సరే అని వసుధర ఫోన్ రావడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు శైలేంద్ర వసుధార కి ఫోన్ చేస్తాడు. అప్పుడు శైలేంద్ర ఊటీ చాలా బాగుందా అక్కడ అట్మాస్ఫియర్ మీరు ఉంటున్న గదులు అన్ని బాగున్నాయా అనడంతో వసుధార షాక్ అవుతుంది. ఏంటి షాక్ అయ్యావా అనే శైలేంద్ర అడగగా ఇందులో షాక్ అవ్వడానికి ఏమీ లేదు మెసేజ్ చేసి అడిగి మళ్ళీ తెలుసుకున్నావు కదా అని అంటుంది వసు. ఎలా తెలిసింది అనడంతో నువ్వే ఆఖరిలో నీ గురించి నువ్వే చెప్పుకున్నావు కదా అనడంతో తెలివితేటలకు శైలేంద్ర షాక్ అవుతాడు.
వసుధారతో ఛాలెంజ్ చేసిన శైలేంద్ర
అయినా మేము ఎక్కడ ఉన్నామన్న విషయం ధరణి మేడమ్ కి ముందే తెలుసు అనడంతో శైలేంద్ర షాక్ అవుతాడు. ఇప్పటికైనా పిచ్చిపిచ్చి ప్రయత్నాలు చేయకుండా ఆపేస్తే బాగుంటుంది అనగా లేదంటే ఏం చేస్తావు అని శైలేంద్ర అడగడంతో మిమ్మల్ని శిక్షించేది నేను కాదు రిషి సార్, మీ పాపం పండే రోజులు దగ్గరలో ఉన్నాయి అనడంతో అది అదే కనుక జరిగితే డిపిఎస్టి కాలేజీ ఉండదు అని బెదిరిస్తాడు. అప్పుడు శైలెంద్రకి తగిన విధంగా బుద్ధి చెప్పి ఫోన్ కట్ చేస్తుంది వసుధార. ఇంతలో ధరణి అక్కడికి కాఫీ తీసుకొని రావడంతో ధరణిపై సీరియస్ అవుతాడు శైలేంద్ర. అప్పుడు ధరణి ఏం మాట్లాడకుండా కాఫీ అక్కడ పెట్టేసి వెళ్ళిపోతుంది. మరొకవైపు రిషి జరిగిన ప్రమాదం గురించి అనుపమ చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంటాడు.
కొడుకుకి తగిన విధంగా బుద్ధి చెప్పిన ఫణీంద్ర
ఆ తర్వాత శైలేంద్ర రిషి వాళ్ళు ఎక్కడ ఉన్నారో కనుక్కోండి. కాలేజీ మొదలయ్యింది కదా వచ్చేయమని చెప్పండి అనడంతో రిషికి ఫోన్ చేయండి అనడంతో లేదు నేను ఫోన్ చేయను అని అంటాడు ఫణీంద్ర. చాలా ముఖ్యమైన పని మీద వెళ్లారు వాళ్లకు నేను ఫోన్ చేయను ఆ పని అయిపోగానే వాళ్లే వస్తారు అంటూ శైలేంద్రకు తగిన విధంగా బుద్ధి చెబుతాడు. తండ్రి మాటలకు శైలేంద్ర షాక్ అవుతాడు. అప్పుడు ఎంతసేపు మీరే తమ్ముడు తమ్ముడు అనుకుంటాడు తప్పితే వాళ్ళు నీకు ఫోన్ చేశారా ఏమైనా అప్డేట్ ఇచ్చారా అనడంతో నువ్వు చూసి మాట్లాడు దేవయాని ఎప్పటికప్పుడు నాకు రిషి అప్డేట్ ఇస్తూనే ఉన్నాడు అనడంతో తల్లి కొడుకులు ఇద్దరు షాక్ అవుతారు. ఇంతలో రిషి ఫోన్ చేయడంతో ఫణీంద్ర ఫోన్ మాట్లాడుతూ అక్కడ నుంచి వెళ్లిపోతాడు.
Guppedantha Manasu October 28 Today Episode: కొడుకును ఎండి చేస్తానన్న దేవయాని
అప్పుడు తల్లి కొడుకులు ఇద్దరూ కలిసి ప్లాన్ చేస్తుండగా రిషి మీద మళ్ళీ అటాక్ చేస్తాను అని అనడంతో వద్దు ఈ సమయంలో ప్లాన్ చేస్తే అడ్డంగా దొరికిపోతాము అని అంటుంది దేవయాని. అప్పుడు దేవయాని నువ్వేం భయపడకు నిన్ను ఎండీ సీట్లో కూర్చోబెట్టే బాధ్యత నాది అని కొడుకుకి మాట ఇస్తుంది. తర్వాత మహేంద్ర కొడుకు కోడల్ని పిలిచి వాళ్లకోసం ఒక కారుని అరేంజ్ చేస్తాడు. అప్పుడు రిషి,వసుధార మొహమాటంగా ఫీల్ అవ్వగా మీరేం మొహమాటంగా ఫీల్ అవ్వకండి వెళ్ళిపోండి అని చెప్పి కొడుకు కోడల్ని పంపిస్తాడు. అప్పుడు రిషి దంపతులు ఎంజాయ్ చేస్తూ సరదాగా అలా బయటకు వెళ్తారు. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ చాలా సంతోషంగా గడుపుతారు. మరొకవైపు మహేంద్ర కొడుకు కోడలు ఫస్ట్ నైట్ కోసం ఏర్పాటు చేయిస్తూ ఉంటాడు. అప్పుడు జగతికి తలుచుకుని బాధపడతాడు.