Guppedantha Manasu October 31 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో అనుపమ ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూనే ఉన్నాయి నా మాట వినండి వీలైనంత తొందరగా ఇక్కడి నుంచి వెళ్లిపోండి అని అంటుంది. నాకు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనిపిస్తోంది అని మహేంద్ర అనడంతో అందుకు వసుధార రిషి కూడా ఓకే అని చెబుతారు. అప్పుడు అనుపమ ఎవరో తెలియనట్టుగా థాంక్యూ మేము బయలుదేరుతాము అనడంతో సరే అని అంటుంది. థాంక్యూ అండి మీ పేరు చెప్పలేదు అనడంతో అనుపమ అనగా వసుధార షాక్ అవుతుంది. అప్పుడు జాగ్రత్త అని చెప్పి అనుపమ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత వసు, రిషి గదిలోకి వెళ్లి జరిగిన విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకు వసుధార పదే పదే మనకు ఇలా జరుగుతోంది అని బాధగా మాట్లాడుతాడు.
రిషికి అడ్డు చెప్పిన వసుధార
అటాక్ చేసే వాళ్ళు మన చుట్టూ ఉండి ప్రతి కదలిక కనుక్కుంటున్నారు అనడంతో ప్రమాదం జరిగిన రెండు సార్లు అనుపమ గారు కాపాడారు కాబట్టి సరి పోయింది లేదంటే చాలా పెద్ద ప్రమాదం జరిగేది అని అంటాడు. అప్పుడు అనుపమ గురించి ఆలోచిస్తూ ఉండగా వసుధార కొన్ని నిజాలు చెప్పడంతో రిషి షాక్ అవుతాడు. ఇంతలోనే అక్కడికి మహేంద్ర వస్తాడు. ఇక్కడికి నన్ను ప్రశాంతత కోసం తీసుకువస్తే ఇక్కడ కూడా ప్రమాదాలు ఎదురవుతున్నాయి కదా అని బాధగా మాట్లాడుతాడు మహేంద్ర. అదేంటి డాడ్ అలా మాట్లాడుతున్నారు అని అంటాడు రిషి. అప్పుడు అనుపమ గురించి అడగబోతుండగా వసుధార అడ్డుపడుతుంది. అప్పుడు మహేంద్ర టాపిక్ డైవర్ట్ చేయడం కోసం జగతిని చంపిన వ్యక్తి నీ మీద అటాక్ చేసిన వ్యక్తి ఒకరేనేమో అనడంతో తెలుసుకుంటాను డాడ్ అనగా మహేంద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
కొడుకుని రెచ్చగొడుతున్న దేవయాని
మరొకవైపు శైలేంద్ర ఆలోచిస్తూ ఉండగా ఇంతలో అక్కడికి దేవయాని వస్తుంది. ఏమి ఆలోచిస్తున్నావు అనగా నా ప్రతి కదలిక నా ఆశయం అన్ని ఎండి సీట్ గురించే అనడంతో అది జరగని పని శైలేంద్ర అంటుంది దేవయాని. ఇన్ని ప్రయత్నాలు చేసినా కూడా వాళ్ళని మనం ఏమి చేయలేకపోయాము అని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతుంది దేవయాని. నిరాశ పడకు నన్ను నిరాశ పెట్టకు ఇప్పుడు బాగా ఆలోచించి ఏదో ఒక ప్లాన్ అని దేవయానికి చెబుతాడు. ఆ జగతి ప్రాణాలు పోయినా కూడా మనకు ఎండీ దక్కడం లేదు అప్పుడు ఎక్కడ ఉన్నామో ఇప్పుడు అక్కడే ఉన్నాము ఎన్ని చేసినా కూడా మన ప్లాన్లు ఏవి వర్క్ అవుట్ అవ్వడం లేదు అని అంటుంది. అప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా దేవయాని అని గట్టిగా అరిచి అక్కడికి వస్తాడు ఫణింద్ర.
భార్య కొడుకుకి వార్నింగ్ ఇచ్చిన ఫణీంద్ర
ప్రాణాల గురించి మాట్లాడుతున్నారు ఎవరి ప్రాణాల గురించి అనగా శైలేంద్ర దేవయాని ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు. చెప్పండి అని అనగానే నేను చెప్తాను మామయ్య గారు అంటూ అక్కడికి వస్తుంది ధరణి. జగతి అత్తయ్య ప్రాణాలు తీసిన వారిని పట్టుకోవాలి అంటూ వాళ్ల గురించి మాట్లాడుతున్నారు మామయ్య గారు అనడంతో ధరణి మాటలకు దేవయాని శైలేంద్ర షాక్ అవుతారు. అప్పుడు ఫణీంద్ర ధరణి చెప్పింది నిజమేనా అని అడగగా నేను జగతిని తలుచుకుని బాధపడుతున్నాను అంటూ దొంగ నాటకాలు ఆడుతుంది దేవయాని. అప్పుడు పనింద్ర నాకు ఒక సహాయం చెయ్ ధరణి ఈ తల్లి కొడుకులు ఇద్దరు మాట్లాడకుండా చేయి ఈ ఒక సహాయం చేయి చాలు అని అనడంతో సరే అని అంటుంది.
Guppedantha Manasu October 31 Today Episode: సంతోషంలో రిషి వసుధార
తర్వాత వసుధార పని చేసుకుంటూ ఉండగా ఇంతలో రిషి అక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు అనడంతో వసుధార కాస్త జోక్ గా మాట్లాడుతుంది. అప్పుడు నేను కాస్త హెల్ప్ చేయనా ఎండి గారు అనగా మీరు నాకు హెల్ప్ చేయడం ఏంటి సర్ అని అంటుంది. ఎందుకు అనడంతో అదంతే సార్ అని సమాధానం చెప్పకుండా తప్పించుకుంటుంది. మీరు గొప్పవారు ఇలాంటి పనులు చేయకూడదు సార్ అని అంటుంది. ఏం కాదు అనడంతో నాకు మాత్రం మీరు చేయడం ఇష్టం లేదు అని అంటుంది వసుధార. అప్పుడు భర్త పై ప్రేమ కురిపిస్తూ ఆకాశానికి ఎత్తెస్తూ మాట్లాడుతుంది వసుధార. అప్పుడు వసు చేతిలో ఉన్న చీరలు లాక్కొని నువ్వు ఎన్ని చెప్పినా నన్ను ఎంత గొప్పగా ఊహించుకున్నా కూడా నేను మీకు సహాయం చేస్తాను అని మొండిగా మాట్లాడుతాడు. అప్పుడు రిషి వసు చేతిలో ఉండే చీరను తీసుకోవడానికి రిషి వసు వెనకాలే పరిగెత్తగా అప్పుడు ఇల్లు అంతా తిరుగుతూ సంతోషంగా ఉండడంతో అది చూసి మహేంద్ర సంతోషపడుతూ ఉంటాడు. అప్పుడు రిషి చీరను పట్టుకొని గట్టిగా లాగడంతో వసుధార వచ్చే రిషిని హత్తుకుంటుంది.