Hansika: హన్సిక పరిచయం అవసరం లేని పేరు బాల నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అనంతరం హీరోయిన్ గాఎంట్రీ ఇచ్చి ఇండస్ట్రీలో నటిస్తూ ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగారు. ఇక ఈమె పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన దేశముదురు సినిమా ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోయిన్గా వచ్చినటువంటి హన్సిక మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. అయితే ఈ సినిమా సక్సెస్ కావడంతో ఈమెకు తెలుగు తమిళ భాషలలో వరుసగా అవకాశాలు వచ్చాయి.

ఇదిలా ఉండగా ప్రస్తుతం పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో స్థిరపడినటువంటి హన్సిక పెళ్లి తర్వాత కూడా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె దేశముదురు సినిమా షూటింగ్ సమయంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. దేశముదురు సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో తనకు కేవలం 15 సంవత్సరాల వయసు అని తెలియజేశారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా తాను 16వ సంవత్సరంలోకి అడుగు పెట్టానని అయితే తన పుట్టినరోజు అని తెలిసి సెట్ లోనే తనకు బర్త్డే సెలబ్రేషన్స్ చేశారని తెలిపారు.

Hansika:  పబ్ కి వెళ్లడం అదే మొదటిసారి…

ఇలా నా పుట్టినరోజు అని తెలియడంతో పూరి జగన్నాథ్ గారు అలాగే అల్లు అర్జున్ సర్ నన్ను బలవంతంగా పబ్ కితీసుకెళ్లారని తెలిపారు. నేను వద్దని చెబుతున్న వినకుండా వారు నన్ను తీసుకెళ్లారని అయితే అప్పటివరకు తాను పబ్ కివెళ్లలేదని అదే మొదటిసారి అని హన్సిక తెలిపారు. అయితే అక్కడికి వెళ్లిన నేను ఒక చోట కూర్చొని ఉండగా పూరి సార్ బలవంతంగా నాతో ఏవేవో తాగించి డాన్సులు కూడా చేయించారు అంటూ ఈ సందర్భంగా అప్పటి సంఘటనలను హన్సిక గుర్తు చేసుకుంటూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

AkashavaniEditor

Hai I'm Akashavani, Film Journalist. I breathe and live entertainment. I love to watch serials and films from childhood-now I get paid for it. I worked in a few top media houses such as News18 Telugu,...

Mail

Published on ఆగస్ట్ 16, 2023 at 11:30 ఉద.