Hansika: దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో ఆపిల్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న హన్సిక తెలుగు తమిళ భాషలలో అగ్ర హీరోలు అందరికి సరసన నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఇక ఈమె బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అనంతరం హీరోయిన్గా తెలుగు తమిళ భాషలలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తూనే మరోవైపు వ్యాపార రంగంలోకి కూడా అడుగుపెట్టారు. ఇలా తన బిజినెస్ పార్టనర్ అయినటువంటి సోహైల్ కతురియా అనే వ్యక్తిని డిసెంబర్ 4వ తేదీ ఎంతో అంగరంగ వైభవంగా ముంటోడా ప్యాలెస్ లో వివాహం చేసుకున్నారు.
ఇలా వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమలో ఉంటూ తమ ప్రేమ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఇలా ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట డిసెంబర్ 4వ తేదీ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు.అయితే పెళ్లి తర్వాత ఈమె పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పి తన భర్తతో కలిసి వ్యాపారాలు చూసుకుంటుందని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలు పూర్తిగా ఆ వాస్తవమని హన్సిక కొట్టి పారేశారు.పెళ్లి తర్వాత సినిమాలు చేయడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని అందుకు సోహైల్ కూడా తనకు పూర్తి మద్దతు తెలిపారని హన్సిక తెలియజేశారు.
Hansika: లేడీ ఓరియంటెడ్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హన్సిక…
ఇకపోతే తాజాగా వస్తున్న కథనాల ప్రకారం హన్సిక త్వరలోనే కోలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ డైరెక్టర్ డైరెక్షన్లో ఒక లేడీ ఓరియంటెడ్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన ప్రకటన అధికారకంగా రాబోతున్నట్లు తెలుస్తోంది.ఇలా పెళ్లయిన నెలకి ఈమె ఒక కొత్త సినిమాలు ప్రకటించే విధంగా ప్లాన్ చేయడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ హన్సిక చాలా ఫాస్ట్ గురూ… పెళ్లయిన నెలకి సినిమాని అనౌన్స్ చేస్తూ సినిమాలతో బిజీ కానున్నారు అంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఈమె ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు తన భర్తతో కలిసి వ్యాపారాలను కూడా చూసుకునే విధంగా తన కెరియర్ ప్లాన్ చేసుకున్నట్టు సమాచారం.