Hansika: హన్సిక పరిచయం అవసరం లేని పేరు.బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముంబై ముద్దుగుమ్మ అనంతరం తెలుగులో దేశముదురు సినిమా ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశారు. ఇలా మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్న హన్సిక అనంతరం తెలుగు తమిళ భాషలలో వరుస సినిమాలలో స్టార్ హీరోలు అందరు సరసన నటించి మెప్పించారు. ఇలా ఇండస్ట్రీలో నటిగా ఎంతో బిజీగా ఉన్న సమయంలోనే ఈమె బిజినెస్ రంగంలోకి కూడా అడుగు పెట్టారు.
ఇలా బిజినెస్ రంగంలో కూడా కొనసాగుతున్నటువంటి హన్సిక తన బిజినెస్ పార్టనర్ సోహైల్ కతురియా అనే వ్యక్తిని ప్రేమించి పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా డిసెంబర్ నెలలో గత ఏడాది వివాహం చేసుకున్నారు. ఇక ఈమె వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.పెళ్లి తర్వాత తన వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్న హన్సిక సినిమాలకు దూరమైనప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తూ రచ్చ చేస్తున్నారు. పొట్టి పొట్టి దుస్తులను ధరిస్తూ అందాల ప్రదర్శన చేస్తున్నారు.
Hansika: విడాకులు తప్పవంటూ షాక్ ఇచ్చిన నేటిజెన్స్..
ఇకపోతే ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు ఈ ఫోటోలపై స్పందిస్తూ.. పెళ్లయిన కూడా ఏమాత్రం గ్లామర్ షో చేయడంలో తగ్గడం లేదని… ఇలా గ్లామర్ షో చేస్తూ పోతే త్వరలోనే విడాకులు తప్పవు అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మరికొందరు ఈ కామెంట్లపై స్పందిస్తూ.. పెళ్లికి ముందు కూడా ఈమె ఇలాగే ఉంది అయితే ఈ విషయాలన్నీ తెలిసే తన భర్త తనని పెళ్లి చేసుకున్నారని తన భర్త ప్రోత్సాహంతోనే ఈమె తిరిగి ఇండస్ట్రీలో కొనసాగడానికి కూడా సిద్ధమైందని ఇలా లేనిపోని వార్తలు సృష్టించి పచ్చని సంసారంలో చిచ్చులు పెట్టకండి అంటూ మరికొందరు ఈమె ఫోటోషూట్ ల పై కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం హన్సిక గ్లామరస్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.