Hansika Motwani: ప్రముఖ సినీ నటి హన్సిక మోత్వాని అంటే తెలియని వారుండరు. ఆమె 15 సంవత్సరాల వయస్సులో పూరీ జగన్నాధ్ తెరకెక్కించిన తెలుగు చిత్రం దేశముదురులో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడీగా గా నటించింది. అలాగే ఈ సినిమాలో ఆమె అమాయకత్వపు నటన తో కుర్ర కారును ఆకట్టుకుంది.
దీంతో ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి. అలాగే బాలివుడ్ లో కూడా అవకాశాలు వచ్చాయి. దీంతో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. ఇక సినిమాల్లో ఎంతో గ్యాప్ తీసుకున్న ఆమె ఇటీవల సందీప్ కిషన్ సరసన తెనాలి రామకృష్ణ సినిమాలో నటించి టాలీవుడ్ కి రీ ఎంట్రీ ఇచ్చింది.
ఇక ఇటీవల ఆమె పెళ్లి చేసుకోబోతుంది అన్న వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. అయితే ఈమె త్వరలోనే పెళ్లి చేసుకోబోతోంది అని.. ఇప్పటికే పెళ్లి కోసం జైపూర్ లోని ముండోటా ఫోర్ట్ ప్యాలెస్ ను కూడా బుక్ చేశారు అని తెలిసింది. అయితే తన కంపెనీ పార్టనర్ అయిన సోహెల్ తో ఆమె ప్రేమ వివాహం చేసుకోబోతుందని తెలిసింది. అయితే హన్సిక పెళ్లి చేసుకోబోయే వరుడు గురించి మరో వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
అయితే హన్సిక చేసుకోబోయే అతని గురించి తెలుసుకోవాలని ప్రజలు చాలా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. దీంతో సోహెల్ కు సంబంధించిన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సొహెల్ ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త. చాలా కాలంగా వీరి మధ్య మంచి స్నేహం ఉంది. బిజినెస్ లో ఇద్దరు పార్ట్నర్స్ గా చేశారు. అంతే కాకుండా సోహెల్ కు ఇది రెండో పెళ్లి.
Hansika Motwani: స్నేహితురాలి మాజీ భర్త ను పెళ్లి చేసుకోనున్న హన్సిక..
2016లో రింకీ అనే అమ్మాయితో ఇది ఎవరికే అతనికి పెళ్లయింది. ఆమెతో పలు విభేదాల కారణంగా విడాకులు తీసుకున్నాడు. అంతకన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే.. రింకీ హన్సిక కు బెస్ట్ ఫ్రెండ్. అలాగే వీరి పెళ్లి వేడుకలకు హన్సిక పాల్గొంది. దీనికి సంబంధించిన ఓల్డ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పుడు హన్సిక ఆ బెస్ట్ ఫ్రెండ్ మాజీ భర్త నే హన్సిక పెళ్లి చేసుకోబోతున్న వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీంతో ఇదేం పోయేకాలం అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.