Hansika Motwani: బొద్దుగుమ్మ చిక్కి బికినీ ట్రీట్ ఇస్తే ఈ రేంజ్‌లో ఉంటుందా..

G K

Hansika Motwani: ‘దేశ ముదురు’ సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లో అడుగుపెట్టిన హన్సిక మొత్వానీ..మొదటి సినిమాతోనే తెలుగులో సాలీడ్ హిట్ అందుకొని ఇక్కడ అందరి దృష్ఠిని ఆకర్షించింది. ఆ తర్వాత హన్సిక తెలుగులో చాలా సినిమాలే చేసింది. కెరీర్ ప్రారంభంలో మస్కా, కంత్రీ, కందిరీగ, దేనికైనా రెడీ లాంటి సినిమాలతో వరుసగా సూపర్ హిట్స్ అందుకుంది. ఇదే సమయంలో అమ్మడు తమిళ సినిమా ఇండస్ట్రీలో కూడా అవకాశాలు అందుకుంది.

అక్కడ కూడా హన్సికకు బాగా పాపులారిటీ వచ్చింది. అక్కడ సూర్య, శింబు లాంటి స్టార్ హీరోల సరసన సినిమాలు చేసిన హన్సిక కోలీవుడ్‌లో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పెంచుకుంది. దాంతో అమ్మడికి అక్కడ ఏకంగా గుడి కట్టిన వారు కూడా ఉన్నారు. అలా హన్సిక ఒక దశలో ఇటు తెలుగులో అటు తమిళలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి క్రేజీ హీరోయిన్‌గా మారింది. చైల్డ్ ఆర్టిస్టుగా హిందీలో మంచి పేరు తెచ్చుకున్న ఈ బొద్దుగుమ్మ అక్కడ కూడా హిట్ సినిమాలలో నటించింది.

Hansika Motwani: బికినీ సూట్ ధరించి మైండ్ బ్లాక్ చేసేసింది.

అయితే, హన్సిక మరీ బొద్దుగా తయారవడంతో హీరోయిన్ అవకాశాలు తగ్గిపోయి కొంత బ్రేక్ వచ్చింది. దాంతో ఇక అందరూ హన్సిక పనైపోయిందనుకున్నారు. కట్ చేస్తే చేతిలో ఆరు చిత్రాలను పెట్టుకొని మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వీటిలో ఓ ప్రయోగాత్మక చిత్రం కూడా ఉంది. ఇది కేవలం ఒకే ఒక్క షాట్‌తో షూటింగ్ పూర్తి చేసిన సినిమా కావడం విశేషం. కాగా, ఇప్పుడు హన్సిక లేటెస్ట్ ఫొటో షూట్ పిక్స్ చూస్తే ఎవరైనా స్టన్ అవ్వాల్సిందే. అలాంటి స్టన్నింగ్ లుక్స్‌తో బికినీ సూట్ ధరించి మైండ్ బ్లాక్ చేసేసింది. బొద్దుగా ఉన్నది కాస్తా..సన్నబడి చాలా నాజూకుగా దర్శనమిచ్చింది. సన్నబడిన తర్వాత బీచ్‌లో బికినీ ధరించి తీసుకున్న లేటెస్ట్ పిక్స్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ పిక్స్ చూస్తే నెటిజన్స్ హన్సిక ఏంటి ఇంత స్లిమ్ అయిందీ.. అంటూ షాకవుతున్నారు.

- Advertisement -