Hansika Motwani బరువు తగ్గిన హీరోయిన్… బికినీ లో కట్టి పుల్లలా ఉందంటూ కామెంట్లు చేస్తున్న నెటిజన్లు…

Joythi R

Hansika Motwani తెలుగులో ప్రముఖ రొమాంటిక్ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన దేశముదురు అనే చిత్రంలో హీరోయిన్ గా నటించి టాలీవుడ్ సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ముంబై బ్యూటీ హన్సిక మోత్వానీ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ అమ్మడు హీరోయిన్ గా నటించిన దేశముదురు చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించడంతో తమిళం, మలయాళం, హిందీ, తదితర భాషల్లో కూడా వరుస సినిమా ఆఫర్లు క్యూ కట్టాయి. కాగా నటి హన్సిక మోత్వాని అందం అభినయంతో పాటు కొంత మేర బొద్దుగా ఉండటంతో ప్రేక్షకులు ఫిదా అయ్యారు. కానీ క్రమక్రమంగా హన్సిక మరింత బరువు పెరగడంతో ఈ ప్రభావం సినిమా అవకాశాలపై పడింది. దీంతో అప్పటి నుంచి నటి హన్సిక బరువు తగ్గేందుకు బాగానే శ్రమిస్తోంది.

ఈ క్రమంలో రోజులో ఎక్కువ సమయం జిమ్ వర్కౌట్లు అలాగే మంచి ఆహారం డైట్ వంటివి పాటిస్తూ దాదాపుగా 20 కిలోలకు పైగా బరువు తగ్గింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ అమ్మడికి నటన పై ఉన్నటువంటి డెడికేషన్ గురించి. అయితే ప్రస్తుతం సమ్మర్ కావడంతో నటి హన్సిక ఇతర దేశాలకు వెళ్లి సమ్మర్ వెకేషన్ ని బాగానే ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా హన్సిక తన అధికారిక ఇంస్టాగ్రామ్ తద్వారా బికిని దుస్తులు ధరించి స్విమ్మింగ్ పూల్ లో ఈదుతున్న సమయంలో తీసినటువంటి ఫోటోలను షేర్ చేసింది. దీంతో ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు ఒక్కసారిగా అవాక్కయ్యారు. అంతేకాకుండా ఎప్పుడు బొద్దుగా కనిపించే హన్సిక ఒక్కసారిగా సన్నగా నాజూగ్గా కనిపించడంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరైతే తమకి బరువు తగ్గిన హన్సిక కంటే బొద్దుగా కనిపించే హన్సిక చాలా ఇష్టమని అంటున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా నటి హన్సిక ఈ మధ్య తెలుగులో నటించిన చిత్రాలతో ప్రేక్షకులను పెద్దగా అలరించలేకపోయింది. దీంతో ఈ అమ్మడు కథల విషయంలో కొంతమేర ఆచితూచి అడుగులు వేస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు 105 మినిట్స్ అనే చిత్రంలో మెయిన్ లీడ్ పాత్రలో నటిస్తోంది. అలాగే మరో హర్రర్ బ్యాక్ డ్రాప్ తరహాలో తెరకెక్కబోతున్న చిరు లోకూడా నటిస్తూ ప్రేక్షకులను భయపెట్టడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.

- Advertisement -