Hansika Motwani తెలుగులో ఆ మధ్య వరుసగా స్టార్ హీరోల చిత్రాలలో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆ అలంరించిన తమిళ బ్యూటిఫుల్ హీరోయిన్ హన్సిక మోత్వాని గురించి టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. అయితే హన్సిక ముంబైలో పుట్టి పెరిగినప్పటికీ ఆమె తల్లిదండ్రులు తమిళ రాష్ట్రానికి చెందిన వారు కావడంతో నటి హన్సికకి కోలీవుడ్ పై కొంతమేర మమకారం ఎక్కువే అని చెప్పవచ్చు. అలాగే మొదటగా హన్సిక సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్ ఫిలిమ్స్ తోనే అయినప్పటికీ ఎక్కువగా ఈ అమ్మడు నటించింది మాత్రం కోలీవుడ్ మరియు టాలీవుడ్ లోనే. కాగా ఈ మధ్యకాలంలో నటి హన్సిక కొంతమేర సినిమాలపరంగా జోరు తగ్గించిందని చెప్పవచ్చు. దీంతో ప్రస్తుతం హన్సిక సెలవులను బాగానే ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలో పలు పర్యాటక ప్రాంతాలను విజిట్ చేస్తూ అప్పుడప్పుడు తనకు సంబంధించిన అందమైన ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది.
ఈ క్రమంలో తాజాగా ఈ అమ్మడు తన అధికారిక ఇన్స్టాగ్రామ్ కథ ద్వారా షేర్ చేసినటువంటి ఓ వీడియో కారణంగా ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఆ వీడియోలో హన్సిక కొంతమేర బోల్డ్ గా దుస్తులు ధరించి ఓ ప్రముఖ నగర వీధులలో గెంతుతూ కనిపించింది.. దీంతో ఈ అమ్మడి అందానికి నెటిజన్లు ఫిదా అయ్యారు. అంతేకాకుండా పెద్ద పాపకి కొంతమేర గౌను చిన్నది అయిందంటూ ఒంటరిగా కామెంట్లు కూడా చేస్తున్నారు. అలాగే ఈ వీడియో షేర్ చేసిన అతి కొద్ది సమయంలోనే లక్షల సంఖ్యలో లైకులు వ్యూస్ వచ్చాయి. ఈ క్రమంలో చాలామంది నటి హన్సిక మొత్వాని లేటెస్ట్ ఫోటోలను చూసినవాళ్ళు ఏకంగా ఆఫర్ల కోసం ఈ అమ్మడు బరువు తగ్గినప్పటికీ పెద్దగా ఫలితం లేదని అలాగే తమకి పాత హన్సిక నచ్చిందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కాగా ప్రస్తుతం నటి హన్సిక తెలుగులో మై నేమ్ ఈజ్ శ్రుతి అనే చిత్రంలో మెయిన్ లీడ్ పాత్రలో నటిస్తుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు హైదరాబాద్ నగర పరిసర ప్రాంతంలో జరుగుతున్నట్లు సమాచారం. ఈ విషయం ఇలా ఉండగా తాజాగా నటించిన ఓ బాలీవుడ్ ప్రముఖ హీరో నటిస్తున్న చిత్రంలో హీరోయిన్గా నటించిన ఆఫర్ తట్టించుకున్నట్లు పలు బాలీవుడ్ సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.