Hari Hara Veera Malli: వకీల్ సాబ్, భీమ్లా నాయక్ వంటి పక్కా కమర్షియల్ హిట్స్ తర్వాత క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియా సినిమా హరి హర వీరమల్లు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన న్యూస్ ఒకటి వచ్చి వైరల్ అవుతోంది. సౌత్ స్టార్ ప్రొడ్యూసర్ ఏ ఎం రత్నం వీరమల్లు చిత్రాన్ని దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. 17వ శతాబ్దంలోని మొఘలుల కాలంనాటి వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.
ఇప్పటికే టాలీవుడ్‌లో పాన్ ఇండియా హీరోలుగా ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్.టి.ఆర్, రామ్ చరణ్, యష్ తమ స్టామినా ఏంటో చూపించగా..ఇప్పుడు ఈ మూవీతో పవర్ స్టార్ స్టామినా ఏంటో ప్రపంచం మొత్తం చూపించబోతున్నారు. ఒకే ఒక్క ఫస్ట్ గ్లింప్స్‌తో హరి హర వీరమల్లు మూవీపై అందరిలోనూ భారీ అంచనాలు పెరిగేలా చేశాడు దర్శకుడు. అయితే, ఏ ముహూర్తాన ఈ సినిమాను ప్రారంభించారో గానీ, సజావుగా చిత్రీకరణ సాగడం లేదు. సెట్స్ వేసి కొంత టాకీ పార్ట్ పూర్తయ్యాక షూటింగ్ ఆగిపోయి 15 నెలలు అప్‌డేట్స్ లేకుండా పోయాయి.
Hari Hara Veera Mallu: వచ్చే ఆగస్టు వరకు వీరమల్లు షూటింగ్ పూర్తి..!
మళ్ళీ మే ఫస్ట్ వీక్ నుంచి సెట్స్ మీదకు వచ్చిన వీరమల్లు షూటింగ్ నాన్ స్టాప్‌గా జరుగుతోంది. కానీ, కొందరు మాత్రం ఈ మూవీ షూటింగ్ మళ్ళీ ఆగిందని..పవన్ మేకర్స్‌కు మళ్ళీ షాకిచ్చాడని ప్రచారం చేస్తున్నారు. అయితే, దీనిలో నిజం లేదని తెలుస్తోంది. వచ్చే ఆగస్టు వరకు వీరమల్లు షూటింగ్ పూర్తి చేసేందుకు మేకర్స్ పక్కాగా ప్లాన్‌తో షూటింగ్ జరుపుతున్నారట. వచ్చే ఏడాది ప్రారంభంలో సంక్రాతి కానుకగా అత్యంత భారీ స్థాయిలో పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్‌గా నిధి అగర్వాల్ నటిస్తోంది.