Pawan Kalyan : టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు రాజకీయాలలో ఫుల్ యాక్టివ్ గా పాల్గొంటున్న విషయం మనందరికీ తెలిసిందే. మొన్నటి వరకు రాజకీయాలలో యాక్టివ్ గా పాల్గొన్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలపై దృష్టిని పెట్టాడు. తాను కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డారు పవన్ కళ్యాణ్. ఇకపోతే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరి హర వీరమల్లు సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. సంబంధించిన కొత్త షెడ్యూల్ ప్రారంభం అయ్యింది. ఇక షూటింగ్లో భాగంగా కాసేపు పవన్ కళ్యాణ్ సరదాగా సెట్స్ లో బైక్ వేసుకొని తిరిగాడు.
ఈ సమయంలోనే కొందరు ఫోటోలను తీసి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. అవి కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలలో పవన్ కళ్యాణ్ బ్లాక్ కలర్ టీషర్ట్ లో బైక్ నడుపుతుండగా మరొక ఫోటోలో ఆ సినిమాకు సంబంధించిన కాస్ట్యూమ్ వేసుకొని బండి నడుపుతున్నాడు. ఇకపోతే ప్రస్తుతం అందరి దృష్టి పవన్ కళ్యాణ్ నడుపుతున్న ఆ బండి పై పడింది. ఆ బండి ధర ఎంత అన్న విషయం తెలుసుకోవడానికి చాలామంది ఆసక్తిని కనబరుస్తున్నారు. ఆ విషయంలోకి వెళ్తే పవన్ కళ్యాణ్ నడుపుతున్న బైక్ బిఎండబ్ల్యూ R1250 GS మోడల్ కు చెందిన ఈ బైక్ ధర అక్షరాల 24 లక్షల రూపాయలు. కాగా ఆ బైక్ ధర విన్న అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.
Pawan Kalyan :
ఇకపోతే పవన్ కళ్యాణ్ కి బైక్స్,గన్స్ అంటే చాలా ఇష్టం అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇకపోతే పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా విషయానికి వస్తే ఇప్పటికే ఈ సినిమా పూర్తి అవ్వాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ మరికొన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ తన కమిట్ అయిన సినిమాలను వచ్చే ఎన్నికలలో పూర్తి చేయాలని భావిస్తున్న విషయం తెలిసిందే. ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు రాజకీయాలలో పాల్గొంటూ రెండింటిని బ్యాలెన్స్ చెక్ చేస్తున్నారు మన పవర్ స్టార్. పవన్ కళ్యాణ్ చివరిగా భీమ్లా నాయక్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో మంచి హిట్ టాక్ ను అందుకున్న పవన్ ప్రస్తుతం అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నాడు.