Hebah Patel: ప్రముఖ నటి హెబ్బా పటేల్ తన కెరీర్ ను మోడల్ గా ప్రారంభించింది. నటనలో ఆసక్తి తో ఆమె నటన రంగం లో ప్రవేశించింది. ఆమె 2014లో కన్నడ చిత్రం అద్యక్షతో తొలిసారిగా నటించింది. అదే సంవత్సరంలో తిరుమనం ఎనుమ్ నిక్కాతో తమిళంలోకి ప్రవేశించింది.
ఆ తర్వాత అలా ఎలా అనే సినిమా తో తెలుగు పరిశ్రమ లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత కుమారి 21F లో ఆమె పాత్రకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది . ఈ రెండు చిత్రాలలో తన పాత్రకు సంతోషం ఫిల్మ్ అవార్డ్స్‌లో ఆమె ఉత్తమ తొలి నటి అవార్డ్ ను అందుకుంది.
ఆ తర్వాత వరుసగా సినిమా అవకాశాలు అందుకుంది. ఈడో రకం ఆడో రకం , ఎక్కడికి పోతావు చిన్నవాడా , మిస్టర్ , అంధగాడు , ఏంజెల్ , నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్, 24 కిస్సెస్ వంటి విజయవంతమైన చిత్రాలలో నటించింది . ఆమె 2020లో మస్తీస్‌తో వెబ్‌లోకి ప్రవేశించింది.
అయితే ఆ తర్వాత ఆమెకు సినిమాల్లో అవకాశాలు రాలేదు. ఇప్పటికీ వరకు చేసిన సినిమాల్లో కూడా ఆమెకు సెకండ్ హీరోయిన్ గా మాత్రమే అవకాశాలు వచ్చాయి. ఏదో రెండు మూడు సినిమాల్లో ఆమె ఫుల్ లీడ్ రోల్ హీరోయిన్ గా చేసింది. ఆ తర్వాత ఆమె శరీరాకృతి లో మార్పు వచ్చింది. ఆమె గతం లో కన్నా చాలా లావుగా మారిపోయింది.
ఇక 2020లో, ఆమె భీష్మలో సారా యొక్క అతిధి పాత్రను చేసింది. అలాగే ఒరేయ్ బుజ్జిగా సినిమాలో సహాయక పాత్రను పోషించింది. ఇక గతం లో ఆమె రామ్ నటించిన రెడ్ సినిమా లో ఓ ఐటెం సాంగ్ కూడా చేసింది. ఇక ఇటీవల ఓదెల రైల్వే స్టేషన్ అనే సినిమాలో నటించింది. సినిమాల్లో పూర్తి ప్రాధాన్యత కలిగిన పాత్రలు అవకాశాలు రానప్పటికీ ఈమె మాత్రం సినిమాల్లో రాణించడానికి చాలా కష్టపడుతుంది.
Hebah Patel: వైరల్ అవుతున్న హెబ్బా పటేల్ ఫోటో..
ఇక తాజాగా హెబ్బా పటేల్ తన సోషల్ మీడియా వేదికగా ఓ ఫోటో ను షేర్ చేసింది. ఆ ఫోటో లో హెబ్బా పక్కన ఒక వ్యక్తి ఉన్నాడు. అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో లో ఆ వ్యక్తి ఎవరన్నది టాక్. కొంత మంది అతను లవర్ అయ్యుండొచ్చు అని కామెంట్స్ చేస్తున్నారు. కానీ హెబ్బా మాత్రం అతనెవరో అక్కడ మెన్షన్ చెయ్యలేదు. ప్రస్తుతం ఆ వ్యక్తి ఎవరా అని అందరికీ అనుమానం.