Hema డ్ర‌గ్స్ కేసు..అక్క‌డికి వెళ్ల‌కున్నా లిస్టులో పేరు..ఆవేద‌న‌లో న‌టి హేమ‌..

Ra One

Hema బంజారాహిల్స్ రాడిస‌న్ బ్లూ హోట‌ల్ ప‌బ్‌పై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు ప్ర‌స్తుతం టాక్ ఆప్ ది టౌన్ గా మారాయి. రైడ్ చేసిన త‌ర్వాత పోలీసులు టీడీపీ ఎంపీ కుమారుడు, ఓ మాజీ ఎంపీ కుమారుడితోపాటు నాగ‌బాబు కుమార్తె నిహారిక, సింగ‌ర్ సిప్లిగంజ్‌ను అదుపులోకి తీసుక‌న్న‌ట్టు వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. సుమారు 150మందిని ఈ కేసులో తొలుత బంజారాహిల్స్ పోలీస్ స్టేష‌న్ కు త‌ర‌లించారు.

ఈ కేసులో సెల‌బ్రిటీలు ఉన్నా, లేకున్నా వారు హైలెట్ కావ‌డం కొత్తేమీ కాదు. ఈ సారి కూడా అలాంటిదే జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే నాగ‌బాబు మాట్లాడుతూ..నా కూతురు ఆ స‌మ‌యంలో అక్క‌డుండ‌టం వ‌ల్లే దీనిపై స్పందిస్తున్నా..నిహారిక ఏ త‌ప్పు చేయ‌లేద‌ని పోలీసులు చెప్పారు. ద‌య‌చేసి పుకార్ల‌ను వ్యాప్తి చేయొద్ద‌ని కోరాడు. కాగా పోలీసులు జాబితాలో కొంద‌రు సినీ ప్ర‌ముఖులున్నారంటూ..వారి పేర్లు క‌నిపించ‌కోవ‌డంతో అంద‌రి అనుమానాలు నిజ‌మ‌య్యాయి. ఇదే క్ర‌మంలో టాలీవుడ్ న‌టి హేమ పేరు కూడా స‌డెన్ గా తెర‌పైకి వ‌చ్చింది.

ఈ నేప‌థ్యంలో హేమ త‌న బాధ‌ను మీడియా ముఖంగా వెల్ల‌బోసుకుంది. తాను అస‌లు ప‌బ్ కే వెళ్లలేద‌ని, అలాంట‌పుడు ఈ కేసులో త‌న పేరును ఎలా ప్ర‌స్తావిస్తార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. డ్ర‌గ్స్ అంశం తెర‌పైకి రాగానే ముందుగా హైలెట్ అయ్యేది సినిమా వాళ్లేన‌ని, క్షుణ్ణంగా ప‌రిశీలిస్తే అస‌లు ప‌బ్‌లో ఉన్న వారి జాబితాలో సినిమా వాళ్లు ఉండ‌ర‌ని, మిగితా వాళ్లే ఎక్కువ‌గా ఉంటార‌ని వాపోయింది.

డ్రగ్స్ కేసు అంత చిన్న విషయం కాద‌ని, త‌న‌కు కూతురు, కుటుంబం ఉంద‌ని, ఇలాంటి సంబంధం లేని కేసులో త‌న పేరును తీసుకురావ‌డంతో తాము ఎంత‌లా ఆవేద‌న చెందాల్సి వ‌స్తుందో అర్థం చేసుకోవాల‌ని మీడియాకు విజ్ఞ‌ప్తి చేసింది హేమ‌. కొంత‌మంది కావాల‌నే త‌నపై దుష్ఫ్ర‌చారంచేస్తున్నార‌ని బాధ‌ప‌డ్డ‌ది హేమ‌. రానున్న రోజుల్లో ఈ డ్ర‌గ్స్ అంశం ఎలాంటి మ‌లుపులు తిరుగుతుందో చూడాలి.

- Advertisement -