Hero Ajith: ప్రముఖ తమిళ హీరో అజిత్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఈయన తమిళ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమైన వ్యక్తి. టాలీవుడ్ లో కూడా ఈయనకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. స్టార్ హీరోగా గుర్తింపు పొందిన అజిత్ ఏమాత్రం హంగు ఆర్భాటాలు లేకుండా ఒక సాధారణ వ్యక్తిగా ఉండటానికి ఇష్టపడతాడు. అంతేకాకుండా అభిమానులతో కూడా ఎంతో ప్రేమగా ఆప్యాయంగా ఉంటాడు. అజిత్ హీరోగా మాత్రమే కాకుండా ఒక గొప్ప మనసు ఉన్న వ్యక్తిగా కూడా అభిమానుల మనసు దోచుకున్నాడు.
అజిత్ ఇప్పటికే ఎన్నోసార్లు ఇతరులకు సహాయం చేసి తన మంచి మనసు చాటుకున్నాడు. తాజాగా మరొకసారి నేలల చిన్నారిని ఎత్తుకొని కష్టపడుతున్న తల్లికి సహాయం చేసి తన మంచి మనసు చాటుకున్నాడు. స్టార్ హీరో స్థాయిలో ఉన్నప్పటికీ ఒక సాధారణ మహిళకు సహాయం చేసిన అజిత్ గురించి సదరు మహిళ భర్త గొప్పగా చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశాడు. ఇప్పుడు ఆ పోస్ట్ వైరల్ కావటంతో అజిత్ చేసిన సహాయానికి అందరూ ఆయన మీద ప్రశంసలు కురిపిస్తున్నారు.
Hero Ajith: గొప్ప మనసు అంటూ…
సదరు మహిళల భర్త సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ..” ‘‘ నా భార్య పది నెలల బాబుతో గ్లాస్గో నుంచి చెన్నై కి ప్రయాణిస్తున్న సమయంలో ఆమెకి హీరో అజిత్‌ను కలిసే అవకాశం వచ్చింది. లండన్‌లోని హాత్రోలో అజిత్ ని కలిసినప్పుడు ఆమె కడుపు మీద బిడ్డతో పాటు రెండు చేతుల్లో ట్రావెల్ సూట్ కేస్, బేబి బ్యాగ్‌తో ఉంది. ఇది గమనించిన అజిత్ గారు నా భార్యకు సహాయం చేయటానికి ముందుకు వచ్చి నా భార్య చేతిలోని బేబీ బ్యాగునుతీసుకున్నారు. నా భార్య వద్దు అన్నా వినకుండా.. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పి ఆయన లగేజ్ తో పాటు బేబి బ్యాగును కూడా విమానం వచ్చే వరకు మోశారు. ఆయన సింప్లిసిటీ, హెల్పింగ్ నేచర్ నన్ను ఎంతో ఇంప్రెస్ చేసింది.” అంటూ పోస్ట్ షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.