Hero Prabhas: టాలీవుడ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా లెవెల్ లో దూసుకుపోతున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ఎంత చెప్పిన తక్కువే. తన నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ప్రభాస్ కేవలం తెలుగు ప్రేక్షకులనే కాకుండా ఇతర ఇండస్ట్రీకి చెందిన ప్రేక్షకులను కూడా అభిమానులుగా మార్చుకున్నాడు. ప్రస్తుతం ఆయనకు హాలీవుడ్ హీరోకి ఉన్నంత క్రేజ్ ఉంది.
ఇక ఇదంతా పక్కన పెడితే వ్యక్తిగతంగా కూడా ప్రభాస్ కు మంచి పేరు ఉంది. గత ఏడాది ఈయన పెదనాన్న కృష్ణంరాజు ఈ లోకాని విడిచిపెట్టి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఎంత బాధలో ఉన్నప్పటికీ కూడా కృష్ణంరాజు చివరి చూపుకు వచ్చిన వారికి కడుపునిండా భోజనం పెట్టాడు. ఇక ఇప్పటికి ఆయన మరణాన్ని తెలుగు ప్రేక్షకులు మర్చిపోలేదు.
అయితే ప్రభాస్ ఇటీవలే బాలయ్య హోస్ట్ చేస్తున్న రియాల్టీ షో అన్ స్టాపబుల్ లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈయనతో పాటు మరో హీరో గోపీచంద్ కూడా పాల్గొన్నాడు. ఇక ప్రభాస్ ఎపిసోడ్ ను రెండు బాగాలుగా చేసిన సంగతి తెలిసిందే. అయితే మొదటి ఎపిసోడ్ ఎంతలా రేటింగ్ సంపాదించుకుందో చూసాం. ఇక రెండో ఎపిసోడ్ కి సంబంధించిన కూడా వీడియో కూడా విడుదల కాగా అందులో ప్రభాస్ ఎమోషనల్ అయినా సన్నివేశం ప్రస్తుతం బాగా వైరల్ అవుతుంది.
Hero Prabhas
అందులో బాలయ్య ప్రభాస్ ను కృష్ణంరాజు గురించి శాశ్వతంగా మిగిలిపోయే ఒక మాట గురించి అడగటంతో ప్రభాస్ తనకు అలా చెప్పడం తెలియదు అంటూ ఐ లవ్ హిమ్ అంటూ ఎమోషనల్ అవుతూ కనిపించాడు. తర్వాత కళ్ళు తుడుచుకున్నట్లు కనిపించాడు. వెంటనే బాలయ్య మాటల్లో చెప్పలేక పోవడమే ప్రేమ అని అన్నాడు. ఇక ప్రభాస్ కళ్ళు తుడుచుకుంటూ కనిపించిన సంఘటన అందరి హార్ట్ ను టచ్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో బాగా వైరల్ అవుతుంది.