Hero Siddharth: తెలుగు ప్రేక్షకులకు హీరో సిద్దార్థ్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. బాయ్స్ చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ హీరో ఆ తర్వాత నువ్వొస్తానంటే నేనొద్దంటానా.. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులతో మంచి ర్యాపో పెంచుకున్నాడు. ఇక పలు సినిమాల్లో నటించి తెలుగునాట నటనలో తనకంటూ చెరగని ముద్ర వేసుకున్నాడు.
ఇక సిద్ధార్థ్ తెలుగు ఇండస్ట్రీ కంటే తమిళ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. కోలీవుడ్ లో కూడా అడపాదడపా సినిమాలు చేస్తూ ప్రస్తుతం ఇండస్ట్రీలో నటుడుగా ఓ వెలుగు వెలుగుతున్నాడు. సిద్ధార్థ్ సోషల్ మీడియాలో కూడా యమా యాక్టివ్ గా ఉంటాడు. తన తాజా అప్ డేట్స్ నెట్టింట్లో పంచుకుంటాడు. ఇదిలా ఉంటే సిద్ధార్థ్ కే జి ఎఫ్ చాప్టర్ 2 సినిమాపై కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు చేశాడు. ప్రస్తుతం సిద్ధార్థ్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

Hero Siddharth: హీరో సిద్దార్థ్ కే జి ఎఫ్ చాప్టర్ 2 సినిమాను ఈ విధంగా అవమానించాడు!
ఒక నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరో సిద్ధార్డ్ కే జి ఎఫ్ చాప్టర్ 2 పాన్ ఇండియా మూవీ అంటే ఫన్నీ గా అనిపిస్తుంది అని అన్నాడు. ఇక పాన్ ఇండియా పదమే వినడానికి ఫన్నీ గా ఉందని తెలిపాడు. ఇక నేను గత పదిహేనేళ్లుగా ఇండస్ట్రీలో చాలా భాషల్లో చేశాను. ఏ భాషలో నటించినా డబ్బింగ్ నేనే చెప్పుకునే వాడిని ఇప్పుడు హిందీ చిత్రం అయినా భగత్ సింగ్ చిత్రంలో కూడా అదే జరుగుతుంది.
కానీ నేను వాటిని ఇండియన్ మూవీస్ అని పిలవడానికి ఇష్టపడుతాను. కానీ ఫ్యాన్ ఇండియా అంటే నాకు చాలా అగౌరవంగా ఉందని హీరో సిద్దార్థ్ తెలిపాడు. ఇక సిద్దార్థ్ రాబోయే సినిమాల విషయానికొస్తే భారతీయుడు-2 సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాకు డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తుంది.