Hero Suman: ఎన్టీఆర్ శతజయంతి వేడుకలలో భాగంగా గత నెల 28వ తేదీ విజయవాడలో బహిరంగ సభను ఏర్పాటు చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ రజనీకాంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన ఎన్టీఆర్ గురించి అలాగే చంద్రబాబు నాయుడు విజయం గురించి మాట్లాడుతూ ప్రశంసలు కురిపించారు. అయితే ఇది నచ్చని వైసిపి ప్రభుత్వం తనపై భారీగా విమర్శలు చేశారు. దీంతో రజినీకాంత్ అభిమానులు రజనీకాంత్ మాట్లాడుతూ ఎక్కడా కూడా వైసిపి ప్రభుత్వం పేరు కూడా పలకలేదు అలాంటి ఆయన పట్ల వైసిపి నేతలు ఇలా మాట్లాడటం సరికాదు అంటూ మండిపడ్డారు.
ఈ క్రమంలోనే వైసీపీ నేతలు చేసిన ఈ పని కారణంగా రజనీకాంత్ కు క్షమాపణలు చెప్పాలనీ డిమాండ్ చేశారు. అయితే వివాదం పై పలువురు సినీ హీరోలు కూడా స్పందిస్తూ వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. గతంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నటువంటి జగపతిబాబు మాట్లాడుతూ తాను రాజకీయాల గురించి పెద్దగా పట్టించుకోనని కానీ రజనీకాంత్ ఏం మాట్లాడిన నిజాలే మాట్లాడతారని ఆయన అబద్ధాలు మాట్లాడారని జగపతిబాబు తెలిపారు.
Hero Suman:
హైదరాబాద్ అభివృద్ధి చెందిందంటే చంద్రబాబే కారణం…
ఇక తాజాగా ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి హీరో సుమన్ ఇదే విషయం గురించి ప్రస్తావిస్తూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ…ఆరోజు రజనీకాంత్ మాట్లాడిన మాటలలో ఏమాత్రం తప్పులేదని ఆయన అన్ని నిజాలే మాట్లాడారని తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరం ఇలా ఉంది అంటే అందుకు గల కారణం చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి పనులేనని సుమన్ తెలిపారు. రాజకీయాలన్న తర్వాత ఎత్తు పల్లాలు సర్వసాధారణం అయన తర్వాత వేరే గవర్నమెంట్ వచ్చింది ఇక చంద్రబాబు నాయుడు టైం బాగాలేక ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అయితే ఆయన చేసింది చేయలేదని చెప్పలేం అంటూ ఈ సందర్భంగా సుమన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.