Hero Yash: వామ్మో.. యష్ ను తన కూతురు ఏం అన్నదో చూడండి!

Akashavani

Hero Yash: తెలుగు ప్రేక్షకులకు హీరో యష్ పేరు పెద్దగా పరిచయం అక్కర్లేదు. కేజిఎఫ్ చాప్టర్ వన్ ద్వారా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన హీరో ఆ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను మరో లెవెల్లో ఆకట్టుకున్నాడు. ఇక విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఆ సినిమాతోనే సంపాదించుకున్నాడు.

బాలీవుడ్ ప్రేక్షకులను సైతం యష్ తన ప్రత్యేక యాటిట్యూడ్ తో ఫిదా చేశాడు. ఇక చాప్టర్ టూ కోసం కళ్ళు కాచేలా ఎదురు చూపించాడు యష్. కాగా ఇటీవలే కేజిఎఫ్ చాప్టర్ టూ ద్వారా అన్ని వెర్షన్స్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యష్ పాన్ ఇండియా లెవల్లో ప్రస్తుతం ఓ వెలుగు వెలుగుతున్నాడు. కలెక్షన్ ల రూపంలో ఈ సినిమా ఆకాశాన్నంటిందని చెప్పవచ్చు.

ఇక సోషల్ మీడియాలో కూడా కే జి ఎఫ్ చాప్టర్ టూ డైలాగ్స్, వీడియోస్ ఒక రేంజ్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఇక యష్ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటాడు. ఎప్పటికప్పుడు తన ఫ్యామిలీ అప్ డేట్స్ నెటిజన్లకు పంచుకుంటాడు. ఇక ఇదే క్రమంలో తాజాగా యష్ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో బాగా హడావిడి చేస్తుంది.

Hero Yash: వామ్మో.. యష్ ను తన కూతురు ఏం అన్నదో చూడండి!
Hero Yash: వామ్మో.. యష్ ను తన కూతురు ఏం అన్నదో చూడండి!

Hero Yash: యష్ ను తన కూతురు అన్న మాట ఇదే!

ఆ వీడియోలో యష్ కూతురు ఐరా.. సలాం రాకీ బాయ్.. రా.. రా.. రాఖి అంటూ ఎంతో అద్భుతంగా పాడింది. ఇక యష్ ఈ వీడియో కింద.. నా రోజును ఐరా తో ప్రారంభించాను అని క్యాప్షన్ రూపంలో చెప్పుకొచ్చాడు. యష్ ఈ వీడియో పంచుకున్న కొద్ది క్షణాల్లోనే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.

ఒకసారి ఈ వీడియో పైన టాప్ చేసిన వారు.. రెండోసారి చూడక తప్పటం లేదు. ఎందుకంటే ఆ వీడియో అంత ఆకట్టుకునే విధంగా ఉంది. ఇక యష్ అభిమానులు కామెంట్ల రూపంలో తన కూతురి పై ఎన్నో లవ్ ఎమోజీలు కురిపిస్తున్నారు. ఇక మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు. మీరు కూడా ఆ వీడియో వైపు ఒక లుక్కేయండి.

- Advertisement -