Hyper Aadi: హైపర్ ఆది పరిచయం అవసరం లేని పేరు బుల్లితెర కార్యక్రమాలలో పెద్ద ఎత్తున సందడి చేస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన మరోవైపు సినిమా అవకాశాలను కూడా అందుకుంటూ వెండితెరపై కూడా సందడి చేస్తున్నారు. ఇలా వెండితెర బుల్లితెర కార్యక్రమాలలో తన కామెడీ పంచ్ డైలాగులతో అందరిని సందడి చేస్తున్నటువంటి ఆది తాజాగా నటుడు నరేష్ పెళ్లిళ్ల గురించి ప్రస్తావిస్తూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
త్వరలోనే వినాయక చవితి రానున్న సందర్భంగా ఈటీవీ వారు స్వామి రారా అని స్పెషల్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నటుడు నరేష్ నటి పవిత్ర లోకేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా బుల్లితెర నటీనటులు పెద్ద ఎత్తున సందడి చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసినట్టు తాజాగా విడుదల చేసిన ప్రోమో చూస్తేనే అర్థమవుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా హైపర్ ఆది నటుడు నరేష్ తో మాట్లాడుతూ పవిత్ర లోకేష్ పక్కన ఉండగానే తన పెళ్లిళ్ల గురించి ప్రస్తావనకు తీసుకువచ్చారు.
Hyper Aadi: ఆదికు బాగా నోటి దూల…
ఈ సందర్భంగా ఆది మాట్లాడుతూ.. నాకు ఇప్పటివరకు ఒక్క పెళ్లి కూడా కావడం లేదు కానీ మీకు పెళ్లి, మళ్లీ పెళ్లి ఎలా సార్ అంటూ తన పెళ్లిల గురించి ప్రశ్నించారు. ఆది ఇలాంటి ప్రశ్నలు వేయడంతో నరేష్ మాత్రం నవ్వుతూ ఈ ప్రోమోలో కనిపించారు.మరి ఈ ప్రశ్నకు నరేష్ ఎలాంటి సమాధానం చెప్పారనే విషయం తెలియాలి అంటే ఈ కార్యక్రమం పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు మనం ఎదురు చూడాల్సిందే. అయితే ఈ మధ్యకాలంలో ఆది నోటి దూల కారణంగా పెద్ద ఎత్తున విమర్శలను ఎదుర్కొంటూ ఉన్నారు. భోళా శంకర్ సినిమా ఈవెంట్ లో ఈయన రాజకీయాల గురించి మాట్లాడటంతో ఆ వ్యాఖ్యలు కాస్త ఎ లాంటి వివాదానికి కారణమయ్యాయో మనకు తెలిసిందే.