Hyper Aadi: హైపర్ ఆది జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో ఫేమస్ అయ్యారు. ఇలా జబర్దస్త్ కార్యక్రమంలో తన అద్భుతమైన పంచు డైలాగులతో అందరినీ ఎంతో సందడి చేసిన హైపర్ ఆది ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమానికి దూరమైనప్పటికీ ఈయన వరుస సినిమాలతో పాటు ఇతర టీవీ షోలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇక హైపర్ ఆది వెంకీ అట్లూరి దర్శకత్వంలో తమిళ హీరో ధనుష్ నటిస్తున్నటువంటి సార్ సినిమాలో కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 17వ తేదీ విడుదల కానుంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా హైపర్ ఆది పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా హైపర్ ఆది మాట్లాడుతూ..ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగ వంశీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ సందర్భంగా ఆది నాగ వంశీ గురించి మాట్లాడుతూ ఈయన ప్రొడ్యూసర్ లాగా పైకి కనిపిస్తారే కానీ ఆయనలో కూడా ఒక హీరో ఉన్నాడు. ఆయన లోపాలు అర్జున్ రెడ్డి అంత యాటిట్యూడ్ ఉంటుంది.. అల్లు అర్జున్ గారంత యాక్టివ్ నెస్ ఉంటుంది. ఇక ఏ విషయమైనా చాలా నిజాయితీగా ముక్కు సూటిగా మాట్లాడతారు. ఈయన ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే ఓ చిన్న ఉదాహరణ చెబుతానని తెలిపారు.
Hyper Aadi: వంశీ అలా మాట్లాడటంతో షూటింగ్ కి వెళ్లాను…
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమా టైటిల్ సాంగ్ చిత్రీకరణలో భాగంగా నాలుగు రోజులపాటు సినిమా షూటింగ్లో పాల్గొన్నాను. ఒకరోజు తాను ఢీ షూటింగ్కు వెళ్లాల్సి వచ్చింది దీంతో ప్రొడ్యూసర్ గారికి ఫోన్ చేసి హలో సార్ నాకు హాఫ్ డే పర్మిషన్ కావాలి ఢీ షూటింగ్ కు వెళ్లాలి అని అడిగాను ఇతర ప్రొడ్యూసర్లు అయితే అలా కుదరదు తప్పనిసరిగా రావాలి అని చెబుతారు. కానీ వంశీ గారు మాత్రం స్ట్రైట్ గా ఏం చెప్పారో తెలుసా.. ఢీ కావాలా.. పవన్ కళ్యాణ్ గారు కావాలా అని అడిగారు. ఆ ఒక్క మాటతో నేను రెండు చేతులు జేబులో పెట్టుకొని నడుచుకుంటూ భీమ్లా నాయక్ షూటింగ్ కు వెళ్ళాను అంటూ అప్పటి సంఘటనలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఆది చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.