Hyper Aadi: రామ్ గోపాల్ వర్మ అంటే తెలుగు రాష్ట్రాల ప్రజలకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో కాంట్రవర్సీ డైరెక్టర్ పేరు తెచ్చుకున్నాడు వర్మ. ఇక అమ్మాయిల విషయంలో ఈయన ప్రవర్తించే తీరు గురించి వివరించాల్సింది ఏమీ లేదు. ఈయన సినిమా జీవితాన్ని పక్కకు పెడితే రియల్ లైఫ్ ని చూసి మాత్రం చాలామంది ఈర్ష పడుతుంటారు. ఎందుకంటే ఈ వయసులో కూడా ఆయన అమ్మాయిలతో అంతగా ఎంజాయ్ చేస్తుంటాడు కాబట్టి.
అటువంటి వర్మ లాగా మారాడు హైపర్ ఆది. టాలీవుడ్ బుల్లితెర ఆర్టిస్ట్ హైపర్ ఆది స్టార్ కమెడియన్గా పేరు తెచ్చుకొని మంచి హోదాతో దూసుకెళ్తున్నాడు. ఇక ఈయన వేసే పంచులు మాత్రం బాగా పేలుతూ ఉంటాయి. ఇతరులను బాగా ఉద్దేశించి బాగా కామెంట్లు చేస్తూ ఉంటాడు. దీంతో ఈయనకు బాగా విమర్శలు కూడా ఎదురయ్యాయి. బుల్లితెరపై ఈటీవీలో వచ్చే ప్రతి షోలల్లో, ఈవెంట్లలో పాల్గొని బాగా సందడి చేస్తూ ఉంటాడు.
అయితే తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ సంబంధించిన ప్రోమో విడుదల అయింది. ఇక సంక్రాంతి సందర్భంగా ఇందులో పాల్గొన్న ఆర్టిస్టులంతా బాగా సందడి చేశారు. హైపర్ ఆది మాత్రం ఓ లెవెల్ లో నవ్వించాడు. అయితే గతంలో రాంగోపాల్ వర్మ అషు రెడ్డి తో బోల్డ్ ఇంటర్వ్యూ చేసిన సంగతి తెలిసిందే. ఇక దీనిని హైపర్ ఆది స్కిట్ లాగా చేసి చూపించాడు. హైపర్ ఆది ఆర్జీవి లాగా నటించాడు.

Hyper Aadi:
అషు రెడ్డి లాగా కమెడియన్ నరేష్ లేడీ గెటప్ వేసుకొని సందడి చేశాడు. ఇక హైపర్ ఆది నరేష్ కాళ్లు పట్టుకొని ముద్దాడుతూ ఉండగా వెంటనే నరేష్ ఎలా ఉంది అని అనటంతో స్నానం చేస్తే బాగుండేది అంటూ పంచ్ వేశాడు హైపర్ ఆది. అంతేకాకుండా దయ్యంతో రొమాన్స్ చేయాలని ఉంది అంటూ వర్మ స్టైల్లో మాట్లాడగా వెంటనే నరేష్ రా అంటూ హైపర్ ఆదిని దగ్గరికి తీసుకున్నాడు. దీంతో అక్కడున్న వాళ్లంతా తెగ నవ్వుకున్నారు.