Hyper Aadi: ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతో మంది కమేడియన్లుగా మంచి గుర్తింపు పొందారు. ఇలా గుర్తింపు పొందిన వారిలో హైపర్ ఆది కూడా ఒకరు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న ఆది జబర్దస్త్ లో అవకాశం దక్కించుకొని టీం లీడర్ గా మంచి గుర్తింపు పొందాడు. ఆ తర్వాత తన పంచులు సెటైర్లతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని జబర్దస్త్ లో టాప్ కమెడియన్ గా పాపులర్ అయ్యాడు. ఇలా జబర్దస్త్ తో పాటు బుల్లితెర మీద ప్రసారం అవుతున్న అనేక టీవీ ఛానల్ లో తన కామెడీతో ప్రేక్షకులను నవ్వించడమే కాకుండా వెండితెర మీద కూడా పలు సినిమాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇదిలా ఉండగా ప్రస్తుతం హైపర్ ఆది గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
స్వతహాగా పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అయిన ఆది ఆయన కోసం ఏం చేయటానికైనా సిద్ధమేనని మీడియా ముందు వెల్లడించాడు. పవన్ కళ్యాణ్ ని ఎవరైనా ఏమైనా అంటే ఆది అసలు భరించలేడు. ఇప్పటికే ఎన్నో సందర్భాలలో పవన్ కళ్యాణ్ మీద తనకు ఉన్న అభిమానాన్ని తెలియజేశాడు. ఇక ఇటీవల పవన్ కళ్యాణ్ కోసం ఆయన స్థాపించిన జనసేన పార్టీకి మద్దతుగా నిలబడ్డాడు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేస్తున్న అధికారపక్ష పార్టీ నేతల గురించి ఆది సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇలా ఆది చేసిన వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా నిలిచాయి.
Hyper Aadi:జనసేన పార్టీ తరఫున ఎన్నికలలో నిలబడనున్న ఆది..
ఇక టీవీ షోలు, సినిమాల ద్వారా అధిక మొత్తంలో సంపాదిస్తున్న ఆది జనసేన పార్టీ కోసం తనవంతుగా భారీ మొత్తంలో విరాళం ఇచ్చినట్లు ప్రస్తుతం వార్తలు వైరల్ అవుతున్నాయి. ఎంత మొత్తంలో విరాళం ఇచ్చాడు అనేది అధికారికంగా ప్రకటన రాలేదు కానీ కచ్చితంగా భారీ మొత్తంలో విరాళం ఇచ్చాడు అనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అంతే కాకుండా వచ్చే 2024 ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ తరఫున ఏదైనా అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని, అందుకే సీట్ కోసం ముందస్తుగానే ఇలా భారీ మొత్తంలో పార్టీకి విరాళం ఇచ్చాడు అంటూ రాజకీయా,సినీ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలలో నిజమెంతుందో తెలియాల్సి ఉంది.