Hyper Aadi: టాలీవుడ్ బుల్లితెరపై తన కామెడీ పంచ్
లతో అందర్నీ బాగా నవ్వించిన కమెడియన్ హైపర్ ఆది. ప్రస్తుతం హైపర్ ఆది స్టార్ కమెడియన్ గా బుల్లితెరపై ఓ రేంజ్ లో పరుగులు తీస్తున్నాడు. ఇక ఈయనకు తెలుగు బుల్లితెరపై మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. జబర్దస్త్ ద్వారా తన కెరీర్ ను ప్రారంభించిన హైపర్ ఆదికి జబర్దస్త్ వేదిక బాగా కలిసి వచ్చింది. ఇక అక్కడి నుంచే వెండితెరపై కూడా పలు సినిమాలలో అవకాశాలు అందుకున్నాడు.
కేవలం జబర్దస్త్ లోనే కాకుండా ఇతర షోలల్లో కూడా తన పంచ్ లతో బాగా సందడి చేస్తుంటాడు. అప్పుడప్పుడు ఈయన చేసే అతి అంతా ఇంతా కాదు. ఆ అతి వల్ల చాలా విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు. ఎవరైనా లేడీస్ కనిపిస్తే చాలు వాళ్ళతో చాలా ఓవర్గా ప్రవర్తిస్తూ ఉంటాడు. అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా అయినా మరో కమెడియన్ సద్దాంతో కలిసిపోయినట్లు కనిపించాడు.
ఇంతకు అసలు విషయం ఏంటంటే.. ఓ సమయంలో సద్దాం, హైపర్ ఆది మధ్య కొన్ని కొన్ని మనస్పర్ధలు రావడంతో వీరిద్దరు కాస్త దూరం దూరంగానే ఉంటున్నారు. అయితే తాజాగా ఈ విషయం మరోసారి బయటపడింది. కొత్త సంవత్సరం సందర్భంగా వేర్ ఇస్ ద పార్టీ అనే ఈవెంట్ ను మల్లెమాల నిర్వహించింది. ఇక ఇప్పటికే రెండు ప్రోమోలు గల కాగా తాజాగా మూడవ ప్రోమో విడుదలయ్యింది.
Hyper Aadi కలిసిపోయిన హైపర్ ఆది, సద్దాం..
అయితే అందులో బుల్లితెర కమెడియన్స్ తో పాటు సీరియల్ నటీనటులు పాల్గొని బాగా సందడి చేశారు. చివర్లో హైపర్ ఆది ఈ ఏడాదిలో తనకు సద్దాంకు మధ్య చిన్న చిన్న మనస్పర్దాలు వచ్చాయని అవి ఇప్పుడు వచ్చే సంవత్సరంలో పూర్తిగా తొలగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ సద్దాంకు కేకు తినిపించాడు. సద్దాం కూడా హైపర్ ఆదికి కేకు తినిపించినట్లు కనిపించాడు. ప్రస్తుతం ఆ ప్రోమో బాగా వైరల్ అవుతుంది.