Hyper Aadi: తెలుగు సినీ ప్రపంచానికి హైపర్ ఆది గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. బుల్లితెర జబర్దస్త్ ద్వారా మంచి ఫేమ్ సంపాదించుకున్న ఆది.. ప్రస్తుతం వెండితెరపై కూడా హడావిడి చేస్తున్నాడు. కానీ లేట్ అయినా లేటెస్ట్ గా వచ్చి అతి తక్కువ సమయంలో మొదటి స్థాయికి ఎదిగాడు ఆది.
ఇక జబర్దస్త్ షోలో అందరూ టైమింగ్ కామెడీ నమ్ముకుంటే తను కొత్త పద్ధతిలో పంచింగ్ కామెడీ నమ్ముకున్నాడు. గ్యాప్ లేకుండా స్కిట్ అయ్యేంతవరకూ పంచులు వర్షం కురిపిస్తూ బుల్లితెర ప్రేక్షకులను ఒక రేంజ్ లో ఆకట్టుకుంటాడు. ఇక ఆది పంచ్ వేసాడు అంటే అవతలి వ్యక్తి నోటికి బ్రేక్ ఇవ్వాల్సిందే.
ఇక ప్రస్తుతం ఆది టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని ఓ వెలుగు వెలుగుతున్నాడు. ఇక ఆ లెవెల్ లో జబర్దస్త్ షోలో నవ్వులు పండించే ఆది.. ప్రస్తుతం ఆ షో నుంచి తప్పుకున్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. గత రెండు వారాలుగా ఆది షో లో కనిపించడం లేదు.

Hyper Aadi: జబర్దస్త్ షో కి హైపర్ ఆది దూరం అయ్యాడు అని చెప్పడానికి కారణం ఇదే!
ఇక బుల్లితెర ప్రేక్షకులు జబర్దస్త్ షోలో అది లేకపోతే ఆ షో పూర్తిగా రేటింగ్ విషయంలో వెనుకబడినట్లే అని కొంతమంది వాపోతున్నారు. అంతేకాకుండా ఆయన లేని జబర్దస్త్ షో మేము చూడము అంటూ కొంతమంది క్లాష్ కు దిగుతున్నారు. యూట్యూబ్ లో ఈ వారం జబర్దస్త్ ఎపిసోడ్లో నెటిజన్ల కామెంట్లు చూస్తే ఆది కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో మీకే అర్థమవుతుంది.
అయితే ప్రస్తుతం ఆది పలు షో లలో బిజీగా ఉన్నట్లు అర్థమవుతోంది. అందుకే జబర్దస్త్ షో కు రెండు వారాల గ్యాప్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక హైపర్ ఆది వ్యక్తిగత విషయానికొస్తే అతడు బీటెక్ పూర్తి చేశాక కొంతకాలం సాఫ్ట్వేర్ జాబ్ చేశాడు. ఆ తర్వాత యాక్టింగ్ పై ఉన్న ఇంటరెస్ట్ తో కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించాడు.