Hyper Aadi: జబర్దస్త్ కామెడీ షో ద్వారా కమెడియన్ గా గుర్తింపు పొందిన హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ షోలో ఆది వేసే పంచులు సెటైర్లు ప్రేక్షకులని బాగా ఆకట్టుకున్నాయి. అయితే ప్రస్తుతం ఆది జబర్దస్త్ కి దూరంగా ఉంటున్నాడు దీంతో జబర్దస్త్ చూసే ప్రేక్షకుల సంఖ్య కూడా బాగా తగ్గిపోయింది. అయితే ఆది జబర్దస్త్ కి దూరంగా ఉన్నప్పటికీ శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో మాత్రం తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తున్నాడు. శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో రాంప్రసాద్, ఆది లీడ్ రోల్ ప్లే చేస్తూ రష్మి మీద పంచులు వేస్తూ ఆమె పరువు తీస్తూ సందడి చేస్తున్నారు.
అయితే అప్పుడప్పుడు ఆది వేసి పంచులు, చెప్పే డైలాగులు విమర్శలకు దారితీస్తూ ఉంటాయి. తాజాగా ఆది ఆది చేసిన పని వళ్ళ ఆడాళ్ళందరూ చుట్టుముట్టి ముకుమ్మడిగా దాడి చేశారు. ఈ సంఘటన శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో చోటుచేసుకుంది. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ షో కి సంబంధించిన ప్రోమో విడుదల అయింది. ఈ ఎపిసోడ్ లో ఆది, భాస్కర్, వర్ష, ఇమ్మాన్యుయెల్, రష్మి, ప్రవీణ్, రాకేష్ వంటి మెయిన్ జబర్దస్త్ కమెడియన్లంతా కలిసి పలు సినిమాల్లోని సీన్ల స్ఫూప్‌తో ఓ స్కిట్ చేశారు. ఈ క్రమంలో `లక్ష్మీ నరసింహా` సినిమాలోని బాలయ్య డైలాగ్‌లో ఆది ఎంట్రీ ఇచ్చాడు.
Hyper Aadi: ఆడాళ్ళ చేతిలో తన్నులు తిన్న ఆది…
స్టేజి మీద ఆది ఎంట్రీ ఇవ్వగానే.. `వచ్చిన మొగుళ్లు వచ్చినట్టే పెళ్లాల చేతుల్లో బలవుతుంటే.. ఈ సారి వచ్చే మొగుడు బలయ్యే వాడు కాదు, బలిచ్చేవాడు వచ్చాడురా.. హైపర్ ఆది` అంటూ . తొడగొడుతూ రెచ్చిపోయాడు. `భర్త అంటే భరించేవాడు కాదు, భరి తెగించేవాడు అని ఈ రోజు నిరూపిస్తా” అంటూ ఆది హెచ్చరించాడు. ఇంతలోనే ఆడవాళ్ల మొత్తం హైపర్ ఆది టీమ్ రౌండప్ చేయడంతో..’ ఇలా రౌండప్ చేయకండి.. కన్‌ఫ్యూజన్‌లో ఎవరి పెళ్లాం అని కూడా చూడను’ అని అంటాడు. అలాగే ఆడవాళ్లు వేసుకొని నైటీల గురించి మాట్లాడుతూ ఆ నైటీలతోనే పిల్లలు ముక్కు చీదుతారు కడుగుతారు మా దగ్గరకు కూడా వస్తారు ముందు ప్లాస్టిక్ ప్రభుత్వాలు నైటీలను బ్యాన్ చేయాలి అని చెప్పారు. అంతటితో ఆగకుండా విక్రమార్కుడు సినిమాలో రవితేజ లాగా రెచ్చిపోయి రండి చూసుకుందాం అనగానే ఆడాళ్ళందరూ చుట్టుముట్టి ఆది అండ్ బ్యాచ్ ని చితకబాదారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారింది.