Hyper Aadi: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్యక్రమాల ద్వారా హైపర్ ఆది తన అద్భుతమైన కామెడీ పంచ్ డైలాగులతో ప్రతి ఒక్కరిని ఎంతో సందడి చేస్తుంటారు. హైపర్ ఆది స్కిట్ కోసం ఎంతో మంది అభిమానులు ఎదురు చూస్తూ ఉంటారు. ఈ విధంగా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను సందడి చేసిన హైపర్ ఆది ప్రస్తుతం ఈ కార్యక్రమానికి దూరమయ్యారు. ఈ క్రమంలోనే జబర్దస్త్ కార్యక్రమానికి దూరం అయినప్పటికీ శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ వంటి కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను తన కామెడీతో సందడి చేస్తున్నారు. ఇకపోతే వచ్చేవారం ప్రసారం కాబోయే ఢీ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.
ఈ ప్రోమోలో భాగంగా హైపర్ ఆది యధావిధిగా తన పంచ్ డైలాగులతో అందరినీ సందడి చేశారు. ఈ ప్రోమోలో హైపర్ ఆది సీరియల్ నటుడు రవి కృష్ణతో కలిసి సీనియర్ కాలేజ్ స్టూడెంట్స్ గా సందడి చేశారు. అదేవిధంగా సీరియల్ నటి నవ్య స్వామితో పాటు మరొక లేడీ కంటెస్టెంట్ కాలేజ్ స్టూడెంట్ గా నటించారు. ఈ క్రమంలోనే హైపర్ ఆది వాళ్లని ర్యాగింగ్ చేస్తూ తన కామెడీతో అందరిని నవ్వించారు. అయితే ఇదే సమయంలోనే వెనకనుంచి యాంకర్ ప్రదీప్ ఆది తలపై ఒక్కసారిగా సరదాగా లాగి పెట్టీ కొట్టాడు.

Hyper Aadi: ప్రదీప్ ను ట్రోల్ చేస్తున్న నెటిజన్స్…
ఈ విధంగా హైపర్ ఆదిని ప్రదీప్ కొట్టడంతో ఆది ఒక్కసారిగా అవమానంగా ఫీలయ్యారు. దీంతో ప్రదీప్ అలా కొట్టడంతో ఆది ఒక్కసారిగా తెల్లమొహం వేసుకున్నారు. ఈ క్రమంలోనే ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది అభిమానులు యాంకర్ ప్రదీప్ వ్యవహార శైలిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు నెటిజన్లు,ఆది అభిమానులు ఈ విషయం పై స్పందిస్తూ బుద్ధుందా లేదా అంటూ పెద్ద ఎత్తున యాంకర్ ప్రదీప్ ను ట్రోల్ చేస్తున్నారు. ఇక ఈ కార్యక్రమానికి సంబంధించి పూర్తి వినోదం చూడాలంటే వచ్చే వారం వరకు వేచి ఉండాలి.