Sreeleela: తెలుగు సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి శ్రీలీల ఒకరు. ఈమె హీరోయిన్ గా ఇండస్ట్రీలో ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలను అందుకొని కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె తాజాగా బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో అందరికీ తెలుసు. ఈ సినిమా తర్వాత ఈమె మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన ఆదికేశవ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.
ఈ సినిమా నవంబర్ 24వ తేదీ విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా విడుదల కావలసి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఈ క్రమంలోనే నవంబర్ 24వ తేదీ విడుదలకు సిద్ధమవుతున్నటువంటి ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా శరవేగంగా కొనసాగిస్తున్నారు. ఈ ప్రమోషన్లలో భాగంగా మాడ్ హీరో అయినటువంటి సంతోష్ శోభన్ శ్రీ లీల వైష్ణవ్ తో కలిసి ఒక ఇంటర్వ్యూ చేశారు. ఇందులో భాగంగా శోభన్ శ్రీలీలతో మాట్లాడుతూ మేము త్వరలోనే ఒక సినిమా చేయబోతున్నాము ఇందులో మీరే హీరోయిన్ అంటూ చెప్పారు.
నాకీ నటన కూడా వచ్చు…
ఈ సినిమాలో మూడు అదిరిపోయే స్టెప్పులతో కూడిన పాటలు ఉన్నాయని శోభన్ చెప్పడంతో శ్రీలీల వెంటనే అదేంటి నేను సినిమాలలో డాన్స్ వేయడానికి తప్ప దేనికి పనికి రానా నాకు నటన కూడా వచ్చు కదా తాజాగా భగవంత్ కేసరి సినిమాలో కూడా నటించాను కదా అంటూ యాంకర్ మాటలకు శ్రీ లీల సమాధానం చెప్పారు. అయితే ఇంటర్వ్యూలో సరదాగా యాంకర్ అన్న మాటలపై స్పందించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.