Shivabalaji: బిగ్ బాస్-1 విన్నర్ గా మరింత పాపులర్ అయ్యాడు టాలీవుడ్ నటుడు శివ బాలాజీ. అంతకుముందు తెలుగులో నటుడిగా శివ బాలాజీ మంచి పేరు తెచ్చుకున్నాడు. అనేక సినిమాల్లో స్టార్ హీరోల సరసన నటించాడు. తెలుగుతో పాటు తమిళంలో కూడా నటించాడు. అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా చేసిన బిగ్ బాస్ సీజన్ 1లో శివ బాలాజీ విన్నర్ గా నిలిచాడు. దీంతో అతడి స్టార్ డమ్ మరింత పెరిగింది.
అయితే ఏ వ్యక్తి అయినా జీవితంలో పైకి రావాలంటే ఎన్నో కష్టాలను ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఎన్నో కష్టాలను ఎదుర్కొంటే కానీ ఎవరైనా పై స్థాయికి ఎగదరు. నటుడిగా పేరు తెచ్చుకుని పాపులర్ అయిన శివ బాలాజీ కూడా లైఫ్ లో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. తాజాగా ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జీవితంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను బయటపెట్టాడు. చాలా వ్యాపారాలు చేసి నష్టపోయినట్లు తెలిపింది.
Shivabalaji
ఈము పక్షుల పెంపకం, పెయిన్ రిలీఫ్ ఆయిల్, సోప్స్ వ్యాపారం చేశానని, ఆ వ్యాపారాల్లో కూడా బాగా నష్టపోయాననిశివ బాలాజీ తెలిపాడు. స్నేహమేరా జీవితం అనే సినిమా చేశానని, కానీ పెద్దగా మార్కెట్ చేయకపోవడంతో లోలోపల చాలా ఫీలయ్యానని తెలిపాడు. తన వల్ల అందరూ బాధపడ్డారని భావించానని,తన వల్ల అందరూ ఫీల్ అయ్యారని శివబాలాజీ తెలిపాడు. తన భార్య మధుమిత వల్ల తాను మళ్లీ నార్మల్ అయ్యానని శివబాలాజీ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
చందమామ, శంభో శివశంభో. ఆర్య, అన్నవరం, టన్త్ కస్లార్ డైరీస్ సినిమాల్లో నటించి శివబాలాజీ మంచి పేరు తెచ్చుకున్నాడు. అంతుకుముందు తన తండ్రి బిజినెస్ ను శివబాలాజీ చూసుకునేవాళ్లు.