Manchu Lakshmi: మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి నటిగానే కాకుండా యాంకర్ గా కూడా మంచి పేరు తెచ్చుకుంది. గుండెల్లో గోదారితో పాటు పలు సినిమాల్లో నటించి పేరు తెచ్చుకున్న లక్ష్మి.. బుల్లితెరపై కూడా తన షోస్ తో మంచి పేరు తెచ్చుకుంది. సెలబ్రెటీల టాక్ షోలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే సెలబ్రెటీలతో అనేక షోలు చేస్తూ బుల్లితెరతో పాటు ఓటీటీలో తన హావా కొనసాగిస్తోంది.
ప్రస్తుతం మంచు లక్ష్మి ఆహా యాప్ లో సెలబ్రెటీలతో ఓ ఫుడ్ షో చేస్తోంది. అనేక మంది సెలబ్రెటీలను తీసుకొచ్చి వారితో వంటలు చేయించడం లాంటివి మంచు లక్ష్మి చేస్తోంది. ఈ షోకు మంచి ఆదరణ వస్తోంది. గత కొన్నేళ్లుగా ఆలా ఆహా యాప్ లో అనేక షోలు మంచు లక్ష్మి చేస్తోంది. ప్రస్తుతం సినిమాకు దాదాపుగా దూరమైన మంచు లక్ష్మి.. వెబ్ సిరీస్, సెలబ్రెటీలతో షోలు చేస్తూ ప్రేక్షకుల్లో పేరు సంపాదించుకకుంటోంది.
అయితే తాజాగా తన భర్త గురించి మంచు లక్ష్మి కొన్ని విషయాలు బయటపెట్టింది. తన భర్త అమెరికాలో ఉంటున్నాడని, తాను అప్పుడప్పుడు వెళతానని మంచు లక్ష్మి తెలిపింది. తన భర్త విషయంలో తాను జాగ్రత్తలు తీసుకుంటానని, ఫుడ్, షూస్ దగ్గర నుంచి హెయిర్ కట్ వరకు అన్నీ తాను చూసుకుంటానంటూ మంచు లక్ష్మి స్పష్టం చేసింది. డైలీ మాట్లాడుకోమని, ఖాళీ దొరికినప్పుడు కాల్ చేసి మాట్లాడతానని మంచు లక్ష్మి స్పష్టం చేసింది.
Manchu Lakshmi:
రోజూ మాట్లాడాల్సిన అవసరం లేదని, ప్రేమ ఉంటే చాలు అని మంచు లక్ష్మి స్పష్టం చేసింది. రోజూ మాట్లాడుకోవడానిక ఏం ఉంటాయని మంచు లక్ష్మి స్పష్టం చేసింది. అతను అప్పుడప్పుడు హైదరాబాద్ వస్తూ ఉంటాడని, తనకు సమయం దొరికినప్పుడు తాను కూడా వెళతానని మంచు లక్ష్మి తెలిపింది. తన భర్త చాలా బద్దకస్తుడని మంచు లక్ష్మి బయటపెట్టింది.