Deepti Sunayana : మామూలుగా ఇల్లు కట్టడం అనేది చాలా డబ్బుతో కూడుకున్నది. చాలామంది సొంతంగా ఇల్లు కట్టుకోవాలి అని చాలా కష్టపడుతూ ఉంటారు. ఇక ఆ కష్టపడటం అనేది చిన్న వయసులో సాధ్యం కానిది. కానీ అటువంటిది సోషల్ మీడియా స్టార్ దీప్తి సునయనకు సాధ్యమైంది. చిన్నవయసులోనే ఈమె ఇల్లు కొనటంతో చాలామంది ఆశ్చర్యపోయారు. అసలు అలా ఎలా సాధ్యమైంది అని అనుకున్నారు. అయితే ఆమె ఇల్లు ఎలా కట్టిందో అన్న విషయాన్ని తెలిపింది.
తొలిసారిగా దీప్తి డబ్స్మాష్ వీడియోలతో అందరి దృష్టిలో పడింది. తన వీడియోలతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. అంతేకాకుండా యూట్యూబ్ లలో పలు షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్ కూడా చేసింది. ఇలా మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. తర్వాత బిగ్బాస్ లో కూడా అడుగుపెట్టి తెలుగు ప్రేక్షకులతో మంచి పరిచయాన్ని పెంచుకుంది.
ఇక బిగ్ బాస్ హౌస్ లో ఉన్నంతకాలం ఎంతలా రచ్చ చేసిందో చూశాం. ఇక అప్పుడే తన మాజీ బాయ్ ఫ్రెండ్, యూట్యూబర్ షణ్ముఖ్ గురించి బయట పెట్టింది. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక షణ్ముఖ్ తో కలిసి పలు షార్ట్ ఫిలిమ్స్ కూడా చేసింది. అయితే షన్ను కూడా బిగ్ బాస్ లో అడుగు పెట్టాక అందులో తన ప్రవర్తన నచ్చకపోవటంతో వెంటనే అతనికి బ్రేకప్ చెప్పేసింది దీప్తి.
ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఎంతలా అంటే ప్రతిరోజు ఏదో ఒక పోస్ట్ షేర్ చేయకుండా ఉండనంత. అయితే షన్నుతో బ్రేకప్ తర్వాత కూడా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా మారింది. పైగా బాగా వర్క్ అవుట్ లు చేస్తూ కనిపిస్తుంది. అయితే ఈ మధ్య ఈమె కొన్ని అర్థం కాని వీడియోలు షేర్ చేస్తుంది.
అసలు తను ఏం షేర్ చేస్తుందో తనకు కూడా తెలుస్తుందో తెలియదు కానీ తాను షేర్ చేసే పోస్టులు మాత్రం అందర్నీ ఆశ్చర్యపరిచేలా చేస్తాయి. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా తన ఫాలోవర్స్ తో బాగా ముచ్చట్లు పెడుతుంది. ఇక తన ఫాలోవర్స్ అడిగిన ప్రశ్నలకు బాగా సమాధానం చెబుతుంది. అయితే తాజాగా తన ఫాలోవర్స్ తో మరోసారి ముచ్చట్లు పెట్టింది.
Deepti Sunayana :
అందులో వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పింది. ఓ నెటిజన్ ఇల్లు కట్టడం ఎలా సాధ్యమైంది అని అడగడంతో.. తన సంపాదనలో 30% ఖర్చు పెట్టి 70% జమ చేసి కొన్నాను అని తెలిపింది. ప్రస్తుతం ఆ స్టోరీ వైరల్ అవ్వడంతో అది చూసిన నెటిజన్స్.. మీరు చాలా గ్రేట్ అంటూ పొగుడుతున్నారు. ఇక ఇటీవలే దీప్తి ఏమోనే అనే వీడియో ఆల్బమ్ చేయగా అది బాగా సక్సెస్ అయ్యింది. యూట్యూబ్ లో కూడా మొన్నటి వరకు ట్రెండ్ లో ఉంది.