Galatta geetu: సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేది ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో ఉంది. ఎంతో మంది హీరోయిన్స్ ఈ కాస్టింగ్ కౌచ్ సమస్యలు ఎన్నో ఎదుర్కొన్నారు. ఇక కొందరు ఈ విషయం గురించి ఓపెన్ అవుతుంటారు. ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్లు క్యాస్టింగ్ కౌచ్ వివాదం గురించి మీడియా ముందుకు వచ్చి చాలాసార్లు చాలా విషయాలు బయట పెట్టారు. ఇక కొందరు తర్వాత అవకాశాల కోసం భయపడి ఈ విషయాలను బయట పెట్టలేకపోతారు.
కానీ తాజాగా మరో బుల్లితెర ఆర్టిస్ట్ కూడా తాను గతంలో ఎదుర్కొన్న చేదు అనుభవం గురించి బయట పెట్టింది. ఇంతకు ఆమె ఎవరంటే.. గలాట గీతూ. ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో ద్వారా మంచి పరిచయం పెంచుకుంది. అందులో తన కామెడీతో లేడీ కమెడియన్ గా మంచి పేరు సొంతం చేసుకుంది. ప్రస్తుతం జబర్దస్త్ లో గరాటగీతూ ఓ రేంజ్ లో ఉందని చెప్పవచ్చు.
మొదట ఈమె టిక్ టాక్ వీడియోల ద్వారా ఫేమస్ కాగా ఆ తర్వాత పలు షార్ట్ ఫిలిమ్స్ లలో నటించి బిగ్ బాస్ లో కూడా అవకాశం అందుకుంది. అలా జబర్దస్త్ లోకి అడుగుపెట్టి మరింత పరిచయాన్ని పెంచుకుంది. ఇక ఈమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని గతంలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని తెలిపింది. తనకు ఆస్ట్రేలియాలో ఓ ఈవెంట్లో హోస్ట్ గా ఆఫర్ వచ్చిందట.

Galatta geetu:ఆ వ్యక్తి తనను అలా అడిగాడట..
ఇక భారీ రెమ్యూనరేషన్ కూడా ఆఫర్ చేశారట. అయితే టికెట్స్ బుక్ చేసే సమయంలో ఈవెంట్ మేనేజర్ పిఏ నుంచి తనకు ఫోన్ వచ్చింది అని.. తన మేనేజర్ తో తనకు పర్సనల్ గా ఓకేనా అని అడిగాడట. అతను అలా అడగటంతో వెంటనే ఆ ఈవెంట్ క్యాన్సిల్ చేసుకుందట. ఇక అతడు పర్సనల్ గా కాకపోయినా హోస్టుగా రావాలని కోరడంతో వెంటనే భయపడి తను ఆ ఈవెంట్ క్యాన్సిల్ చేసుకుందట.