Ileana: దేవదాసు సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అందాల నటి ఇలియానా సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. ఆ తర్వాత బాలీవుడ్లో మంచి మంచి అవకాశాల కోసం సౌత్ ఇండస్ట్రీకి దూరమైంది. అయితే బాలీవుడ్ లో మాత్రం ఈ అమ్మడికి సరైన అవకాశాలు లభించలేదు. దీంతో ప్రస్తుతం అడపా దడపా సినిమాలలో నటిస్తూ ఉంది. ఇదిలా ఉండగా గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఇలియానా హాట్ టాపిక్ గా మారింది.ఇక కొంత కాలం క్రితం తాను గర్భవతినని ఇలియానా ప్రకటించటంతో అందరూ షాక్ అయ్యారు. అసలు ఇలియానాకి పెళ్లి ఎప్పుడు జరిగింది అని సందేహాలు మొదలయ్యాయి.
అయితే ఇలియానా మాత్రం తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు సంబంధించిన వివరాల గురించి బయట పెట్టలేదు. ఇలియానా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన ప్రెగ్నెన్సీ కి సంబంధించిన ఫోటోలను, వీడియోలను ఫ్యాన్స్ తో పంచుకుంతోంది. దీంతో ఇలియానా కడుపులో పెరుతున్న బిడ్డకి తండ్రి గురించి అనేక వార్తలు వినిపిస్తున్నాయి. ఇలియానా కూడా ఆ వ్యక్తి వివరాలు బయటపెట్టకుండా కొంచం కొంచం క్లూ ఇస్తూ అందరిలో ఆసక్తి రేపుతోంది. అయితే హీరోయిన్ కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ తో ఇలియానా డేటింగ్ చేస్తూ గర్భం దాల్చిందని బీ- టౌన్ లో చాలా జోరుగా వార్తలు ప్రచారం అయ్యాయి.
Ileana: వీడి ఫోటో షేర్ చేసిన ఇలియానా…
అయితే ఇలియానా మాత్రం ఆ వార్తలపై ఎక్కడ స్పందించలేదు. ఈ క్రమంలో ఇలియానా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరు అన్న విషయంపై సస్పెన్స్ కొనసాగుతున్న తరుణంలో ఇలియానా షేర్ చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎట్టకేలకు ఇలియానా తన బాయ్ ఫ్రెండ్ ని రివీల్ చేస్తూ ఫోటో షేర్ చేసింది. తన ప్రియుడితో డిన్నర్ డేట్ కి వెళ్లిన ఇలియానా అక్కడ అతడితో కలిసి దిగిన ఫోటోలు షేర్ చేసింది. దీనితో ఇలియానా మిస్టరీ మాన్ వెలుగులోకి వచ్చాడు. కంప్లీట్ గడ్డంతో స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. అయితే ఇలియానా అతడి పేరు వివరాల గురించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. దీంతో ప్రస్తుతం ఇలియానా బాయ్ ఫ్రెండ్ వివరాల గురించి తెలుసుకోవటానికి నెటిజన్లు ఆరా తీస్తున్నారు.