Ileana: సినిమా ఇండస్ట్రీలో పెళ్లి కాకుండానే పిల్లల్ని కనటం, ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం సర్వసాధారణం అయింది. ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్లు ఇలా పెళ్లి కాకుండానే పిల్లలకు జన్మనిచ్చి ఆ తర్వాత వివాహం చేసుకున్నారు. తాజాగా ఈ జాబితాలోకి మరొక స్టార్ హీరోయిన్ కూడా చేరబోతోంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటించిన దేవదాస్ సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగుపెట్టి తన అందం అభినయంతో ప్రేక్షకులను మైమరిపించిన అందాల నటి ఇలియానా. మొదటి సినిమాతోనే హీరోయిన్గా మంచి గుర్తింపు ఆ తర్వాత తెలుగు, తమిళ్, హిందీ భాషలలో స్టార్ హీరోల సరసన నటించిన స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది .
అయితే గత కొంతకాలంగా సరైన అవకాశాలు లేక ఇలియానా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. ప్రేమలో విఫలం అయిన తర్వాత ఇలియానా బాగా బొద్దుగా మారిపోయింది. దీంతో ఈ అమ్మడికి అవకాశాలు కరువయ్యాయి. ఇది ఇలా ఉండగా తాజాగా ఈ అమ్మడు తాను తల్లి కాబోతున్నట్లు ఒక షాకింగ్ పోస్ట్ షేర్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అండ్ సో ది అడ్వెంచర్ బిగిన్స్`(ఇక సాహసయాత్ర ప్రారంభమవుతుంది) అని రాసి ఉన్న చిన్నారి టీషర్ట్ ని, అలాగే తన మెడలో `మామా` అని ఉన్న చైన్‌ని షేర్ చేసింది. ఈ ఫోటోలను షేర్ చేస్తూ ” కమింగ్ సూన్, నా చిన్నారి డార్లింగ్‌ని కలిసేందుకు ఆతృతతో ఉన్నాను” అని రాసుకోచ్చింది.

Ileana: తండ్రి ఎవరు…
దీంతో ఇలియానా షేర్ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. గతంలో ప్రియుడికి బ్రేకప్ చెప్పిన ఇలియానా ఇప్పుడు ఇంత సడెన్‌గా తన ప్రెగ్నెన్సీని ప్రకటించడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లకు అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటి వరకు ఇలియానా ప్రేమ, పెళ్లి గురించి ఒక్క వార్త కూడా వినిపించలేదు. కానీ ఇప్పుడు ఇలా తల్లి కాబోతున్నట్లు ప్రకటించడంతో అందరికీ అనుమానం కలుగుతోంది. ఇలియానా నిజంగానే తల్లి కాబోతోందా? లేక ఏదైనా సినిమా ప్రమోషన్ కోసం ఇలా ప్రయోగాలు చేస్తుందా? అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే.. మరికొందరు మాత్రం ఇలియానాకు శుభాకాంక్షలు తెలుపగా మరికొందరు బిడ్డకు తండ్రి ఎవరు అంటూ భారీగా ట్రోల్ చేస్తున్నారు.