Ileana: గోవా బ్యూటీ ఇలియానా ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున వార్తలు నిలుస్తున్నారు.ఈ విధంగా ఇలియానా వార్తల్లో నిలవడానికి కారణం లేకపోలేదు పెళ్లి కాకుండానే ఈమె తల్లి కాబోతున్నాను అనే విషయాన్ని ప్రకటించి అందరికి షాక్ ఇచ్చారు అయితే తన ప్రేగ్నెన్సీకి కారణమైనటువంటి వ్యక్తి ఎవరు అసలు తనకు పెళ్లి జరిగిందా లేదా అన్న విషయాలను ఈమె రహస్యంగా దాచి తన ప్రేగ్నెన్సీ విషయాలను మాత్రమే అభిమానులతో పంచుకునేవారు.అయితే ఒకరు ఒక సమయంలో ఈమె తన ప్రియుడి గురించి చెప్పుకొచ్చారు. తన కష్ట సమయంలో ఆయన తోడు ఉన్నారు అంటూ తన గురించి గొప్పగా చెప్పారు.
ఇలా తన బాయ్ ఫ్రెండ్ గురించి ఒక్కో విషయాన్ని ఇలియానా రివీల్ చేస్తూ వచ్చారు. చివరికి తన ఫోటోని రివిల్ చేసినప్పటికీ ఆయన ఎవరు తన వివరాలు ఏంటి అనే విషయాలను మాత్రం వెల్లడించలేదు. ఇలా వివరాలు తెలియ చేయకపోయినా తన బాయ్ ఫ్రెండ్ ఫోటోని ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో తన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఇక ఆగస్టు 1వ తేదీ ఇలియానా బాబుకి జన్మనిచ్చిన విషయం మనకు తెలిసిందే తన బాబుకు కో ఫోనిక్స్ డోలన్ అనే నామకరణం చేశామని ఈమె తెలియజేశారు.
Ileana: ప్రెగ్నెన్సీ ప్రకటించిన తర్వాత వివాహం…
ఇలా తన ప్రియుడు తన బాబు గురించి ఈమె తెలియచేయడంతో ఇలియానా బాయ్ ఫ్రెండ్ ఎవరు అనే విషయాల గురించి కొంత సమాచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇలియానా తనని వివాహం చేసుకొని బిడ్డకు జన్మనిచ్చారన్న విషయం కూడా బయటపడింది. ఇలియానా పరిచయం చేసిన వ్యక్తి పేరు మైఖేల్ డోలన్ వీరు వివాహం కూడా చేసుకున్నారు ఇలియానా ప్రెగ్నెన్సీ విషయాన్ని ప్రకటించిన తరువాత మే 13న ఇలియానా-మైఖేల్ డోలన్ చర్చిలో నిరాడంబరంగా వివాహం చేసుకున్నట్లు సమాచారం. ఇలియానా మాత్రం ఏప్రిల్ 18న గర్భం దాల్చిన విషయం వెల్లడించారు. దీంతో తన ప్రెగ్నెన్సీ విషయం కన్ఫర్మ్ అయిన తర్వాతనే వీరిద్దరు వివాహం చేసుకున్నారని తెలుస్తోంది.