Ileana: గోవా బ్యూటీ ఇలియానా సోషల్ మీడియా వేదికగా తాజాగా చేసినటువంటి ఒక పోస్ట్ సోషల్ మీడియాని షేక్ చేస్తుందని చెప్పాలి. తాను బేబీ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను అంటూ ఆమె చేసినటువంటి పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇలా ఈమె బేబీ కోసం ఎదురుచూస్తున్నాను అని పోస్ట్ చేయడంతో ఇలియానా తల్లి కాబోతున్నారా అసలు ఈమెకు పెళ్లెప్పుడు జరిగింది అంటూ పెద్ద ఎత్తున ఈ విషయం గురించి సోషల్ మీడియాలో చర్చలు జరిగాయి.
ఇక పలువురు నెటిజన్స్ పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరు అంటూ కూడా ప్రశ్నించారు.అయితే ఈమె స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలోనే పలువురు హీరోలతో రిలేషన్ లో ఉంటూ బ్రేకప్ లు చెప్పుకున్న సంఘటనలు మనకు తెలిసిందే.అయితే తాజాగా పెళ్లి కాకుండానే ఇలియానాను ప్రెగ్నెంట్ ను చేసినది మరెవరో కాదని ఇండస్ట్రీకి చెందినటువంటి ఒక స్టార్ హీరోయిన్ తమ్ముడు అనే విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఆ స్టార్ హీరోయిన్ ఎవరు? ఏంటి అనే విషయానికి వస్తే…
Ileana: కత్రినా సోదరుడే కారణమా…
బాలీవుడ్ సమాచారం ప్రకారం ఇలియానా ప్రెగ్నెన్సీకి కారణం హీరోయిన్ కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెన్ట్ మైఖేల్ కారణమని వార్తలు బాలీవుడ్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. గత ఏడాదిగా వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారనే వార్తలు కూడా వినపడుతూనే ఉన్నాయి. విక్కీ కౌశల్-కత్రినా దంపతులు మాల్దీవ్స్ వెకేషన్ కి వెళ్లారు. వీరి ట్రిప్ లో ఫ్రెండ్స్ తో పాటు ఇలియానా, సెబాస్టియన్ సైతం హాజరు కావడంతో వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారనే వార్తలు బయటకు వచ్చాయి.అయితే వీరి రిలేషన్ గురించి ఓపెన్ కాకపోయినా ఇద్దరి మధ్య ఘాడమైన ప్రేమ ఉందని ఆ ప్రేమ కారణంగానే ఇలియానా బిడ్డకు జన్మనివ్వబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వినపడుతున్నాయి. అయితే ఇలియానా గురించి ఇలాంటి వార్తలు వస్తున్న తరుణంలో ఆమె ఈ వార్తలను ఖండించే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం.