Ileana ఇలియాన కి మందు పిచ్చి ఎక్కువగా ఉందంటూ ……

Joythi R

Ileana ముంబై నుంచి టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఒక ఊపు ఊపినటువంటి నటీనటులలో గోవా బ్యూటీ ఇలియానా ఒకరు. అయితే ఈ అమ్మడు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి దేవదాసు అనే చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచిహిట్ అవడంతో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి. దీంతో అతి తక్కువ సమయంలోనే నటి ఇలియానా దాదాపుగా స్టార్ హీరోయిన్ రేంజ్ కి వెళ్ళిపోయింది.

ఈ క్రమంలో నటి ఇలియానా కూడా తన నటన, అందం, అభినయం జీరో సైజ్ నడుము వంటివాటితో కుర్రకారు మతి పోగొట్టి బాగానే ఆకట్టుకుంది. కానీ టాలీవుడ్లో వరుసగా అవకాశాలతో రాణిస్తున్న సమయంలో నటి ఇలియానా కి బాలీవుడ్ పై మనసు వెళ్లడంతో తెలుగు చలనచిత్ర పరిశ్రమ వదిలేసి బాలీవుడ్ కి వెళ్ళిపోయింది. దీంతో అప్పటివరకు స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్లో రాణిస్తున్న ఈ బ్యూటీ ఒక్కసారిగా టాలీవుడ్ ని పక్కనపెట్టి బాలీవుడ్ కి వెళ్లి చేజేతులారా తన సినీ కెరీర్ని నాశనం చేసుకుంది.

అయితే తాజాగా నటి ఇలియానా గురించి పలు వార్తలు సోషల్ మీడియా మధ్యమాలు తెలుగు వైరల్ అవుతున్నాయి. అయితే ఇంతకీ ఆ వార్తలేమిటంటే నటి ఇలియానా టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి వెళ్లి పోయినా తర్వాత ఈ అమ్మడు ఒకటి, రెండు చిత్రాలలో హీరోయిన్ గా నటించినప్పటికీ ఈ చిత్రాలు డిజాస్టర్ కావడంతో పెద్దగా గుర్తింపు లభించలేదు. దీనికితోడు అవకాశాలు కూడా తగ్గిపోయాయి.

దీంతో నటి ఇలియానా తీవ్ర మనస్థాపానికి గురై ఇంటిపట్టునే ఖాళీగా ఉంటున్న సమయంలో కొంతమేర మద్యం అలవాటు కి బా బానిసైందని పలు కథనాలు వినిపించాయి. అయితే తాజాగా నటి ఇలియానా తన అధికారిక సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా టకీలా గురించి మాట్లాడటం తో ఒక్కసారిగా ఇలియానా అభిమానులు అవాక్కయ్యారు. దీంతో ఈ అమ్మడు మద్యం సేవించడానికి బానిసైందని వినిపించిన వార్తలలో నిజం ఉందని కొందరు ప్రచారాలు చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా నటి ఇలియానా గత నాలుగు సంవత్సరాలుగా సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. దీంతో ఈ అమ్మడు ఇంటి పట్టునే ఖాళీగా ఉండటంతో ఫుడ్ డైట్ విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేక పోయింది. దీంతో నటి ఇలియానా జీరో సైజ్ నుంచి బొద్దు గా తయారయింది. ఈ విషయాన్ని లేటుగా తెలుసుకున్న ఇలియానా ప్రస్తుతం మళ్ళీ బరువు తగ్గే పనిలో పడింది. అయినప్పటికీ పెద్దగా ఉపయోగం లేకపోయింది.

- Advertisement -