Indian 2: కమల్ సినిమాతో రీ ఎంట్రీ..కాజల్ క్లారిటీతో ఒక్కరికీ మైండ్ బ్లాక్..అవును..చందమామ కాజల్ అగర్వాల్ ఇకపై సిల్వర్ స్క్రీన్ మీద కనిపించదని ప్రచారం చేస్తున్నవారికి నిజంగా మైండ్ బ్లాకయ్యే అప్‌డేట్ ఇది. పెళ్ళి తర్వాత సినిమాలను చేసిన కాజల్ ప్రెగ్నెంట్ అయ్యాక పూర్తిగా సినిమాలను వదులుకుంది. ఆచార్య సినిమాలో నటించినప్పటికీ ఆమె పాత్ర లేకుండా చేశారు. ఇక నాగార్జున సరసన నటించాల్సిన ది ఘోస్ట్ కూడా వదిలేసింది. అలాగే, కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఇండియన్ 2 మూవీ మాత్రం ఇంతకాలం క్లారిటీ లేదు.
ఈ నేపథ్యంలో కాజల్ అగర్వాల్ ఇండియన్ 2 మూవీ నుంచి కూడా తప్పుకుందని ఈ మధ్య వరుసగా కథనాలు వచ్చాయి. అంతేకాదు, ఈ సినిమా దర్శకుడు శంకర్ కూడా కాజల్ అగర్వాల్ కాకుండా బాలీవుడ్ స్టార్స్ దీపిక పదుకొన్, కత్రినా కైఫ్ లలో ఒకరిని తీసుకోవాలనుకుంటున్నారని టాక్ వినిపించింది. దీనిపై స్వయంగా కాజల్ అగర్వాల్ క్లారిటీ ఇచ్చింది. తాజాగా ఇన్స్టాగ్రాం ద్వారా కొద్దిసేపు తన అభిమనౌలతో చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఓ అభిమాని..మీరు ఇండియన్ 2 లో నటించడం లేదట కదా..? అని అడిగాడు.
Indian 2: రకుల్ ప్రీత్ సింగ్ కూడా మరో కీలక పాత్రలో..
దానికి కాజల్ క్లారిటీ ఇచ్చింది. ఈ మూవీలో తాను నటిస్తున్నానని, ఈ సెప్టెంబర్ 13 నుంచి కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవుతుందని చెప్పింది. అంతే కాదు..ఈ షెడ్యూల్‌లో తాను కూడా జాయిన్ కాబోతున్నట్టుగా ఓపెన్ అయింది. దాంతో ఇప్పటివరకు వచ్చినవన్నీ పూర్తిగా రూమర్స్ అని తేలిపోయింది. ఇక 1996లో వచ్చిన ఇండస్ట్రీ హిట్ ఇండియన్ సినిమాకు సీక్వెల్‌గా ఇది రూపొందుతోంది. రకుల్ ప్రీత్ సింగ్ కూడా మరో కీలక పాత్రలో కనిపించబోతున్నట్టు ఇది వరుకే వార్తలు వచ్చాయి. ఇక ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే 70 శాతం టాకీ పార్ట్ పూర్తైంది.