Indravathi Chauhan ఈ మధ్య కాలంలో యూట్యూబ్ వీడియోలు బాగా పాపులర్ అవుతున్నాయి. దీంతో ఫోక్ సాంగ్స్ కి మంచి డిమాండ్ పెరుగుతుంది. దీంతో ఈ ఫోక్ సాంగ్స్ ద్వారా ఇప్పటికే చాలామంది సింగర్లు సినిమాల్లో పాటలు పాడే అవకాశాలు కూడా దక్కించుకుని బాగానే రాణిస్తున్నారు. ఉదాహరణకి ఆ మధ్య బుల్లెట్ బండి సాంగ్ పాడిన తెలుగు ప్రముఖ సింగర్ మోహన్ భోగరాజు దాదాపుగా ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలందుకుంది.
అంతేకాకుండా ఈ పాటను దాదాపుగా 200 మిలియన్ల మందికిపైగా నెటిజన్లు వీక్షించారు. ఇలాగే ఆ మధ్య సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప చిత్రంలో ఉ అంటావా ఊ అంటావా పాట పాడిన ఇంద్రావతి చౌహాన్ కూడా ఓవర్ నైట్ లోనే పాపులర్ అయిపోయింది. దీంతో ప్రస్తుతం ఈ అమ్మడికి టాలీవుడ్ కోలీవుడ్ తదితర సినీ పరిశ్రమలలో పాటలు పాడే అవకాశాలు బాగానే క్యూ పడుతున్నట్లు సమాచారం.

ఈ మధ్య కాలంలో ఇంద్రావతి చౌహాన్ సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు తనకు సంబంధించిన ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ బాగానే అలరిస్తోంది. అయితే తాజాగా ఈ అమ్మడు తన అధికారిక ఇంస్టాగ్రామ్ తద్వారా అందమైన ఫోటోలను షేర్ చేసింది. దీంతో నెటిజన్లు ఒక్కసారిగా ఫిదా అయ్యారు. అంతేకాకుండా సింగర్ ఇంద్రావతి చౌహన్ తన గాత్రంతో మాత్రమే కాకుండా తన అందచందాలతో కూడా నెటిజన్లను బాగానే అలరిస్తోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.
అయితే ఇంద్రావతి చౌహాన్ ఇప్పటికే తెలుగులో మంచి సింగర్ గా కొనసాగుతున్న మంగ్లీ కి సోదరి అవుతుంది. అందువల్లనే పుష్ప చిత్రం ఆడిషన్స్ జరుగుతున్న సమయంలో మంగ్లీ తన సోదరి ఇంద్రావతి చౌహాన్ ని తీసుకెళ్లి ఆడిషన్ ఇప్పించింది. దీంతో ఈ అమ్మడి గొంతు కి ఫిదా అయిన సుకుమార్ ఆఫర్ ఇచ్చాడు. కట్ చేస్తే ఉ అంటావా ఉఊ అంటావా పాటతో ఓవర్ నైట్ సార్ అయిపోయింది. కాగా తాజాగా సింగర్ ఇంద్రావతి చౌహాన్ కి ఓట్ తెలుగు ప్రముఖ దర్శకుడు తెరకెక్కిస్తున్న చిత్రంలో మళ్లీ స్పెషల్ సాంగ్ పాడే అవకాశం వచ్చినట్లు సమాచారం.