interesting facts about pawan kalyan son akira nandan
interesting facts about pawan kalyan son akira nandan

Akira Nandan : అకీరా నందన్.. ఎవరో కాదు పవన్ కళ్యాణ్ రెండో భార్య రేణు దేశాయ్ కొడుకు. ఇప్పుడు పెద్దోడయిపోయాడు. మేజర్. తండ్రిని మించిన తనయుడిలా చాలా హైట్ అయ్యాడు. సినిమా హీరోలా అచ్చం పవన్ కళ్యాణ్ జీరాక్స్ లా ఉంటాడు అకీరా నందన్. పవన్  కళ్యాణ్ తేజస్సుతో, ఆయన లక్షణాలను పుణికిపుచ్చుకొని పుట్టిన అకీరా నందన్ గురించి పవన్ ఫ్యాన్స్ కు కూడా చాలా విషయాలు తెలియవు. నిజానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఎంత క్రేజ్ ఉందో.. అకీరా నందన్‌కు కూడా అంతే క్రేజ్ ఉంది.

ఇప్పటి వరకు ఒక్క  సినిమాలో నటించకున్నా.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేకున్నా అకీరాకు ఉన్న క్రేజే వేరు. అకీరా ఫోటోలను తన తల్లి, పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సోషల్ మీడియాలో అప్పుడప్పుడు పోస్ట్ చేస్తుంటుంది. అలా.. అకీరా గురించి అందరికీ తెలిసింది. ఆ ఫోటోలను చూసి పవన్ ఫ్యాన్స్ ఖుషీ అవుతుంటారు. అకీరాకు యూత్‌లోనూ మంచి క్రేజ్ ఉంది. ప్రస్తుతం అకీరా వయసు 19 ఏళ్లు. అంటే.. సినిమాల్లోకి వచ్చే వయసే. అకీరా ప్రస్తుతం బాక్సింగ్ నేర్చుకుంటున్నాడు. అయితే.. అకీరాకు యాక్టింగ్ అంటే అంతగా ఆసక్తి లేనట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ కూడా అకీరాను సినిమాల్లోకి తీసుకురావాలని అనుకోలేదట. నిజానికి.. అకీరా హీరో మెటీరియల్. కానీ.. తన తల్లి రేణు కూడా అతడు అస్సలు యాక్టర్ అవడు అంటూ ఆ మధ్య పవన్ ఫ్యాన్స్ కు ఓ సమాధానంగా చెప్పింది. బాక్సింగ్ అంటే అకీరా ఇష్టం కాబట్టి నేర్చుకున్నాడట కానీ.. సినిమాల్లోకి రావాలని మాత్రం కాదంటూ రేణు ఆ మధ్య  స్పష్టత ఇచ్చింది.

Akira Nandan : అకీరా, ఆధ్య కోసం సమయం కేటాయిస్తున్న పవన్ కళ్యాణ్

నిజానికి పవన్  కళ్యాణ్, రేణు దేశాయ్ చట్టపరంగా విడిపోయారు. విడాకులు తీసుకున్నారు. కానీ.. అకీరా, ఆధ్య కోసం మాత్రం తల్లిదండ్రులుగా కొనసాగుతున్నారు. అందుకే.. ఆయన ఎంత బిజీగా ఉన్నా ఇంకా పిల్లల కోసం సమయం కేటాయిస్తూనే ఉంటాడు. అందుకే.. వాళ్లకు సంబంధించిన అన్ని విషయాల్లో పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్ అవుతుంటాడు. వాళ్ల చదువు గురించి, వాళ్ల కెరీర్ గురించి కూడా పవన్ పట్టించుకుంటారు. అకీరా గత సంవత్సరం తన స్కూల్ గ్రాడ్యుయేషన్ ను పూర్తి చేశాడు. గ్రాడ్యుయేషన్ డేకు పవన్ కూడా హాజరయ్యారు. అప్పుడు రేణు, పవన్ ఒకే ఫ్రేమ్ లో కనిపించారు. ఇటీవల ఖుషీ రీరిలీజ్ అయినప్పుడు కూడా అకీరా హైదరాబాద్ వచ్చి ఆ సినిమాను థియేటర్ లో ప్రేక్షకుల మధ్య చూశాడు. ప్రస్తుతం అకీరా తన తల్లి రేణుతోనే పూణెలో ఉంటున్నాడు. కానీ.. అప్పుడప్పుడు హైదరాబాద్ వచ్చి తన తండ్రిని కలిసి వెళ్తుంటాడు. అకీరాకు టాలీవుడ్ హీరోలు సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ మంచి ఫ్రెండ్స్. ఈ ముగ్గురు ఎప్పుడూ కలిసి తిరుగుతుంటారు. అలాగే.. మరో హీరో అడివి శేష్ కూడా అకీరాకు క్లోజ్ ఫ్రెండ్. వీళ్లిద్దరు కూడా ఎక్కువగా కలిసి తిరుగుతుంటారు. అకీరాకు సినిమా ఫీల్డ్ ఇష్టమో లేదో తెలియదు కానీ.. అకీరాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం అని, అతడే సొంతంగా మ్యూజిక్ కంపోజ్ కూడా చేస్తుంటాడని అడివి శేష్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.