Surya – Jyothika : సూర్య అనగానే మనకు టక్కున గుర్తొచ్చే మరో పేరు జ్యోతిక. ఆమె సూర్య భార్య. సూర్య ఎంత అందంగా ఉంటాడో… ఆయన ఎంత స్టయిల్ గా ఉంటాడో అందరికీ తెలుసు. కోలీవుడ్ మాత్రమే కాదు.. తెలుగులోనూ ఆయన స్టార్ హీరో. తెలుగులో కూడా సూర్య సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. తెలుగు హీరోల కంటే కూడా సూర్యకు ఒక్కోసారి క్రేజ్ పెరుగుతూ ఉంటుంది. ఆయన తీసే సినిమాలు కూడా చాలా వైవిధ్యంగా ఉంటాయి. అయితే.. చాలామందికి సూర్య భార్య జ్యోతిక అని తెలియదు. అసలు వీళ్ల పెళ్లి ఎలా జరిగింది. హీరోయిన్ జ్యోతికతో సూర్య పెళ్లి ఎలా జరిగింది.. అనే స్టోరీ చాలామందికి తెలియదు.
నిజానికి.. సూర్య, జ్యోతిక ఇద్దరూ కలిసి పలు సినిమాల్లో నటించారు. తమిళంలో వాళ్లు ఇద్దరు కలిసి నటించిన చాలా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. వీళ్ల జోడికి క్రేజ్ కూడా వచ్చింది. ఆ తర్వాతే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. జ్యోతికను పెళ్లి చేసుకుంటా అని వెంటనే తన కుటుంబ సభ్యులకు చెప్పాడట సూర్య. దీంతో సూర్య ఇంట్లో పెళ్లికి ఒప్పుకోలేదట. తను ఇండస్ట్రీలో హీరోయిన్ కదా. తనను ఎలా పెళ్లి చేసుకుంటావని వద్దన్నారట.
Surya – Jyothika : ఎవ్వరికీ చెప్పకుండా జ్యోతికను పెళ్లి చేసుకున్న సూర్య
తన ఇంట్లో ఒప్పుకోకపోవడంతో తన ఫ్యామిలీ మెంబర్స్ కు ఇష్టం లేకపోయినా జ్యోతికను సూర్య రహస్యంగా గుడిలో చేసుకున్నాడట. ఆ తర్వాత ఈ విషయం వాళ్ల ఇంట్లో వాళ్లకు తెలిసి ఇక ఏం అనలేకపోయారట. సూర్యను, జ్యోతికను యాక్సెప్ట్ చేశారట. ఆ తర్వాత అధికారికంగా పండితులు, బంధువుల సమక్షంలో మరోసారి సూర్య, జ్యోతిక పెళ్లిని జరిపించారట. అలా సూర్య, జ్యోతిక పెళ్లి రెండు సార్లు జరిగిందన్నమాట. ఇండస్ట్రీలో ప్రస్తుతం ఈ జోడి.. బెస్ట్ కపుల్ గా గుర్తింపు పొందింది. జ్యోతిక కూడా ఒకప్పుడు తెలుగు, తమిళం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. అలా ఇద్దరు స్టార్లు ఒక్కటయ్యారు. ఇప్పుడు వాళ్ల జీవితం సంతోషంగా ఉంది.