Guppedantha Manasu Vasudhara : వసుధార అని పేరు చెబితే చాలు టక్కున గుప్పెడంత మనసు సీరియల్ అని చెబుతాం. అవును.. స్టార్ మాలో ప్రసారం అయ్యే గుప్పెడంత మనసు సీరియల్ ఎంత ఫేమస్సో, ఆ సీరియల్ లో నటించే రిషి, వసుధార జంట కూడా అంతే ఫేమస్. ఇద్దరినీ కలిపి రిషిధార అని కూడా పిలుస్తుంటారు. ఈ సీరియల్ లో వీళ్ల ప్రేమకథ చాలా క్యూట్ గా ఉంటుంది. ఈ సీరియల్ లో హీరోయిన్ గా నటిస్తున్న వసుధార అసలు పేరు రక్ష గౌడ. తను తెలుగు అమ్మాయి కాదు. కన్నడ అమ్మాయి. తనది బెంగళూరు.
చిన్నప్పటి నుంచి తనకు నటనపై ఆసక్తి ఎక్కువ. అందుకే మోడలింగ్ లో అడుగుపెట్టి అక్కడి నుంచి ఇండస్ట్రీకి పరిచయం అయింది. తనకు ముందు కన్నడ సీరియల్ లో నటించే అవకాశం వచ్చింది. ఫుట్ మాలీ అనే కన్నడ సీరియల్ లో నటించింది వసుధార. ఆ తర్వాత తెలుగులోనూ తనకు సీరియల్స్ లో నటించే అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. కృష్ణవేణి అనే సీరియల్ లో నటించింది రక్ష.
Guppedantha Manasu Vasudhara : ఆ తర్వాత గుప్పెడంత మనసు సీరియల్ లో నటించే అవకాశం
కృష్ణవేణి సీరియల్ ద్వారా రక్ష గౌడకు అంతగా గుర్తింపు రాలేదు. కానీ.. ఆ తర్వాత తనకు అవకాశం వచ్చిన గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా ఎక్కువ పాపులారిటీ వచ్చింది. ఆ తర్వాత ఇక తను వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా తనకు బీభత్సమైన క్రేజ్ వచ్చింది. తనకు ఇప్పుడు సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి. తను ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. అనతి కాలంలోనే తెలుగు ఇండస్ట్రీలో ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది రక్ష గౌడ.