Intinti Gruhalakshmi April 27 Episode: తీపి కబురు విన్న తులసి.. కానీ అంతలోనే మరో చేదు వార్త!

Akashavani

Intinti Gruhalakshmi April 27 Episode: ఈరోజు ఎపిసోడ్ లో తమ ఫ్యాక్టరీ మూతపడటంతో తులసి తో పాటు ఇంట్లో ఉన్న వాళ్లంతా బాధపడుతూ ఉంటారు. ఇక తులసి మరుసటిరోజు ఉదయాన్నే తన స్కూటీ కడుగుతూ ఉంటుంది. అంతలోనే అక్కడికి ఒక ఆవిడ వచ్చి తులసి దగ్గర నిలబడి ఉంటుంది. ఇక తులసి ఆమెను ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది.

తులసికి సహాయం చేసిన ప్రవళిక..

వెంటనే ఆవిడ తులసికి నెత్తిన ఒక మొట్టికాయ వేసింది. దాంతో వెంటనే తులసి తన చిన్ననాటి ఫ్రెండ్ ప్రవళిక అని గుర్తు పడుతుంది. ఇక ఇద్దరు కలిసి తమ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకొని సరదాగా ఓ చోట కూర్చుని మాట్లాడుకుంటారు. ఇక ప్రవళిక తన స్నేహితురాలు తులసి కష్టాలను తెలుసుకొని తన కంపెనీని తిరిగి తెరిచేలా చేస్తుంది. దాంతో తులసి ఎంతో సంతోషపడుతుంది.

ఇక ఇంట్లో కి రమ్మని తన స్నేహితురాల్ని పిలవడంతో మరోసారి వచ్చినప్పుడు వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు పరంధామయ్య, అనసూయ లు తులసి కష్టాల గురించి మాట్లాడుకుంటారు. ఇక అక్కడికి తులసి అత్తయ్య, మామయ్య అంటూ తెగ సంతోషంగా వస్తుంది. తన ఫ్రెండ్ ప్రవళిక తమ కంపెనీ తెరిచేలా చేసింది అని చెప్పటంతో వాళ్లు కూడా సంతోష పడతారు.

కోపంతో రగిలి పోతున్న లాస్య..

ఇక తులసి ఎలాగైనా ఈ విషయాన్ని తమ కార్మికులకు చెప్పాలి అని అక్కడికి బయలుదేరుతుంది. మరోవైపు లాస్య కు తులసి కంపెనీ తెరిచిందని తెలియటంతో కోపంతో రగిలిపోతుంది. వెంటనే భాగ్య దగ్గరికి వెళ్తుంది. భాగ్య మాత్రం తన ఫోన్ లో పాటలు వింటూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇక లాస్య భాగ్య ని చూసి మరింత కోపంతో రగిలిపోతూ భాగ్య ఫోన్ ను కింద పడేస్తుంది.

మళ్లీ తులసి ఫ్యాక్టరీ తెరిచారని.. అస్సలు నువ్వు చేసింది కరెక్టా కాదా అంటూ గట్టిగా అడుగుతుంది. దాంతో భాగ్య కూడా ఆశ్చర్యపోతూ.. నేను చేసింది కచ్చితంగా సక్సెస్ కావాలి అని కానీ ఇలా అవుతుందని అనుకోలేదని అంటుంది భాగ్య. అదే సమయంలో కింద పడిన ఫోన్ నుంచి మరో పాట రావడంతో ఆ ఫోన్ ను ముక్కలు ముక్కలు చేస్తుంది లాస్య. దాంతో భాగ్య ఫోన్ ముక్కలైందని బాధపడుతూ ఉంటుంది

కార్మికులకు చేదు వార్త వినిపించిన తులసి..

మరోవైపు తులసి ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్లి అందరికీ తీపికబురు చెబుతుంది. కానీ తాను ఇకపై అందులో బాధ్యతలు తీసుకోనని ఆ కంపెనీ అధికారి కి చెబుతుంది. దాంతో అందరూ బాధపడుతూ.. ఎందుకిలా అని అడగటంతో.. ఇలా జరిపించింది నా పైన కోపం ఉన్నవాళ్లే అంటూ.. మళ్లీ భవిష్యత్తులో ఇటువంటివి ఎదురు కావద్దని ఈ నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

Intinti Gruhalakshmi April 27 Episode: స్పృహ కోల్పోయిన తులసి..

ఇక ప్రేమ్.. మ్యూజిక్ ఆఫీస్ దగ్గరికి వెళ్లగా.. అక్కడ మ్యూజిక్ డైరెక్టర్ ప్రేమ్ పాటను ప్రొడ్యూసర్ కు ఇస్తాడు. ఆ ప్రొడ్యూసర్ ఆ పాటను బాగా మెచ్చుకుంటాడు. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకున్న ప్రేమ్ అది తన పాట అని మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్లి అతనిపై అరుస్తాడు. తరువాయి భాగం లో అనసూయ దంపతులు తులసితో.. మీకు మేము భారంగా ఉన్నామమ్మా అంటూ బాధపడుతూ ఉంటారు. అంతేకాకుండా దివ్య కూడా తన చదువు మానేయటానికి సిద్ధంగా ఉంటుంది. దాంతో తులసి అక్కడే స్పృహ కోల్పోతుంది.

- Advertisement -