Intinti Gruhalakshmi April 28 Episode: ఈరోజు ఎపిసోడ్ లో ప్రేమ్ తన మ్యూజిక్ డైరెక్టర్ తో కాసేపు వాదనకు దిగుతాడు. అంతేకాకుండా తన పాటను అలా తీసుకోవడం కరెక్ట్ కాదని నిలదీస్తాడు. ఇక అతడు ఇందులో జాబ్ మానేస్తావా మానేసేయ్ అనడంతో.. ప్రేమ్ గతంలో శృతి మాట్లాడిన మాటలు తలుచుకొని మానేయనని.. ఇక్కడే పని చేస్తానని అంటాడు. అంతేకాకుండా ఆ మ్యూజిక్ డైరెక్టర్.. ఈ పాట ఎవరు రాశారు అని అడగడంతో.. ప్రేమ్ మీరే రాశారు సార్ అని బాధతో చెబుతాడు.
సీన్ కట్ చేస్తే..
తులసి ఇంట్లో పనులు చేస్తూ ఉండగా.. దివ్య, అనసూయ దంపతులు ఆలోచనలో పడతారు. ఇక పరంధామయ్య తులసితో ఒక్క మాట చెప్పకుండా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నావమ్మా అని అంటాడు. అనసూయ కూడా బాధపడుతూ తొందరపడి ఏం తీసుకున్నావ్ అమ్మ అంటూ.. నీ గురించి నువ్వు ఆలోచించుకోవాలి కదా అని అంటుంటారు. అప్పటికే అక్కడికి చిన్ననాటి ఫ్రెండ్ ప్రవళిక వచ్చి చాటున వింటుంది. పరంధామయ్య దంపతులు.. మీకు మేము భారం గా ఉన్నాము కదా అని అనడంతో దివ్య కూడా అవును మమ్మీ నేను కూడా చదువు మానేస్తాను అని అంటుంది.
తులసీ నిలదీయడానికి వచ్చిన ప్రవళిక..
దాంతో తులసి కళ్ళు తిరిగి కింద పడిపోవడంతో అక్కడే ఉన్న ప్రవళిక వచ్చి నీళ్లు తాపించి కూర్చో పెడుతుంది. ఇక తనతో మాట్లాడుతూ.. నువ్వు తీసుకున్న నిర్ణయం తప్పు అనిపించి నిలదీద్దాం అనుకున్నాను. కానీ నీ మాటలు విన్నాక అది కరెక్ట్ అనిపించింది అని అంటుంది. ఇక తులసి ఇంట్లో వాళ్ళను తనకు పరిచయం చేస్తుంది. ప్రవళిక ఆకలి వేస్తుంది అనటంతో భోజనం చేద్దామని తులసి అంటుంది. మరోవైపు ప్రేమ్ ఆఫీస్ లో జరిగిన సంఘటనను గుర్తు చేసుకొని బాధపడతాడు. కోపంతో ఒకరి మీద రాయి విసిరేసి ఇంట్లోకి వెళ్లి దాచుకుంటాడు.
ప్రేమ్ కు కంగ్రాట్స్ చెప్పిన శృతి..
ఇక శృతి రావటంతో.. శృతికి తన బాధలు చెప్పుకుంటాడు. శృతి మాత్రం కంగ్రాట్స్ మై డియర్ అంటూ ప్రేమ్ ను పట్టుకుంటుంది. శృతి మాటలకు ప్రేమ్ షాక్ అవుతూ ఉంటాడు. కానీ శృతి రాసిన పాట సెలెక్ట్ అయింది కదా అంటూ ఆ విధంగా పొగుడుతుంది. శృతి మాటలకు ప్రేమ్ ఫిదా అవుతాడు. అంతేకాకుండా తన తల్లితో పోలుస్తాడు. ఇక తన కెరీర్ ఇప్పుడే మొదలైంది అని.. ఇక మరిన్ని పాటలు రాస్తాను అంటూ ఉత్సాహంగా ఉంటాడు.
Intinti Gruhalakshmi April 28 Episode: మోడ్రన్ డ్రెస్ వేసుకున్న తులసి..
ఇక ప్రవళిక, తులసి కబుర్లు పెట్టుకుంటే ఉంటారు. జీవితాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక తులసిని ఎలాగైనా మార్చాలి అని ప్రవళిక అనుకుంటుంది. దాంతో తులసి ఒక చోట కలవమని చెబుతుంది. మరోవైపు లాస్య బాగా ఫీల్ అవుతూ కనిపిస్తుంది. అంతేకాకుండా నందు వచ్చి తులసి విషయంలో మరింత కోపంతో రెచ్చి పోతూ ఉంటాడు. ఇక తరువాయి భాగంలో తులసిని ప్రవళిక ఓ షాపింగ్ మాల్ తీసుకొని వెళ్లి అక్కడ తనతో మోడ్రన్ డ్రెస్ వేయిస్తుంది.