Intinti Gruhalakshmi April 29 Episode: పనిమనిషిగా మారిన ప్రేమ్.. తులసికి జ్ఞానోదయం చేసిన ప్రవళిక!

Akashavani

Intinti Gruhalakshmi April 29 Episode: ఈరోజు ఎపిసోడ్ లో దివ్య నిద్రపోతుండగా ఉదయాన్నే తన ఫోన్ అలారం మోగుతుంది. వెంటనే ఉలిక్కిపడి లేచి ఇదంతా తనపై తన తల్లి కుట్ర చేసిందని అనుకుంటుంది. అంతేకాకుండా పక్కన ఒక లెటర్ లో తన నానమ్మ వాళ్లకి కాఫీ ఇవ్వమని రాసి ఉంటుంది. మరోవైపు పరంధామయ్య, అనసూయల మధ్య సరదాగా చిన్న గొడవ కూడా జరుగుతుంది. అప్పుడే దివ్య వచ్చి వాళ్లకు కాఫీ ఇవ్వడంతో వాళ్లు షాక్ అవుతారు. ఇంతకు తులసి ఎక్కడికి పోయింది అని ఆలోచనలో పడతారు.

సీన్ కట్ చేస్తే..

ఇక తులసి మాత్రం తన ఫ్రెండ్ ప్రవళిక తో కలిసి వాకింగ్ చేస్తుంది. ఆ సమయంలో తులసి తన జీవితంలో జరిగిన సంఘటనలను ప్రవళిక తో చెబుతుంది. తులసి ఎదుర్కొన్న కష్టాల గురించి ప్రవళిక షాక్ అవుతూ తులసి ధైర్యం ను మెచ్చుకుంటుంది. అంతేకాకుండా వీరిద్దరు ఒక దగ్గర కూర్చొని కాసేపు ముచ్చట్లు పెడతారు. అంతేకాకుండా ప్రవళిక తులసికి తన విషయంలో జ్ఞానోదయం చేస్తుంది.

తులసికి ధైర్యం ఇచ్చిన ప్రవళిక..

ఇక మళ్ళీ తిరిగి వాకింగ్ మొదలు పెట్టగా.. అక్కడ తులసి చీర కట్టుకొని ఉండటంతో వాకింగ్ చేయడం వల్ల ఇబ్బంది పడుతుంది. దీంతో ప్రవళిక రేపటి నుంచి వాకింగ్ షూట్ వేసుకుని రమ్మని అనడంతో తులసి నేనా అంటూ భయపడుతుంది. ఎవరి కోసం నీ ఇష్టాలను మార్చుకో వద్దు అని ధైర్యం ఇస్తుంది. మరోవైపు అంకిత ఇంట్లో తానే టిఫిన్ పెట్టుకొని తింటుంది.

అభిపై కోపంతో రగిలి పోతున్న అంకిత..

ఆ సమయంలో అక్కడికి అంకిత వాళ్ళ తల్లి వచ్చి అభిను వదిలేసి అలా తింటున్నావ్ ఏంటి అని గట్టిగా హెచ్చరిస్తుంది. అప్పుడే అభి అక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఇలా చేస్తుంది ఆంటీ అని అంటాడు. ఇక అంకిత కోపంతో రగిలిపోతూ ఆంటీ నుంచి నన్ను దూరం చేశావు కాబట్టి నా నిర్ణయం కూడా మార్చుకున్నాను అని అంటుంది. ఓవైపు శృతి ఇంట్లో పనిచేస్తూ కళ్ళు తిరుగుతూ నీరసంగా కనిపిస్తుంది.

Intinti Gruhalakshmi April 29 Episode: పని మనిషి గా మారిన ప్రేమ్..

అది చూసిన ప్రేమ్ శృతిని రెస్ట్ తీసుకోమని చెప్పి.. తానే మొత్తం ఇంట్లో పని చేస్తూ ఉంటాడు. అది చూసి శృతి కాస్త బాధగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక శృతికి జ్వరం రావడంతో ప్రేమ్ డాక్టర్ ను తీసుకుని రావడానికి వెళ్తాడు. ఇక ఇంట్లో అనసూయ, దివ్య లు తులసి కోసం తెగ ఎదురు చూస్తూ ఉంటారు. ఆ సమయంలో పరంధామయ్య అనసూయపై సరదా కామెంట్లు చేస్తాడు.

అప్పుడే తులసి ఇంట్లోకి రావటంతో తులసి తను వాకింగ్ కి వెళ్ళిన విషయాన్ని చెబుతుంది. తరువాయి భాగంలో ప్రవళిక దివ్య తో ఈ రోజు మీ మమ్మీ నాతో వస్తుంది అని చెబుతుంది. ఆ తర్వాత ప్రవళిక తులసి షాపింగ్ మాల్ కు తీసుకెళ్లి అక్కడ తనతో డ్రెస్ వేయిస్తుంది.

- Advertisement -