Intinti Gruhalakshmi April 30 Episode: ఈ రోజు ఎపిసోడ్ లో దివ్య తన తల్లిని ఎక్కడికి వెళ్ళావమ్మ అంటూ ప్రశ్నిస్తుంది. నాకు క్లాస్ టైమ్ అవుతుంది. కనీసం టిఫిన్ కూడా చేయలేదు అంటూ అరుస్తుంది. తులసి మాత్రం తనకు ఆరోగ్యం బాగాలేనందుకు వాకింగ్ కు వెళ్ళాను అంటుంది. రేపటినుండి నువ్వు కాస్త నీకోసం చూసుకో అనడంతో దివ్య అలిగి కూర్చుటుంది. ఇక అనసూయ కూడా ఉదయాన్నే పనులు ఉంటాయి కదా అని అనడంతో వెంటనే పరంధామయ్య ఇప్పుడైనా తులసి ఆరోగ్యం గురించి అయినా ఆలోచించండి అని అంటాడు.
ఇక దివ్య ఇంట్లో ఒంటరిగా కూర్చొని బాధపడటంతో తులసి అక్కడికి వెళ్లి ఓదార్చుతుంది. దివ్య మాత్రం నన్ను ఎక్కడ దూరం చేస్తావో అన్న భయంతో అలా చేశాను అమ్మ అంటూ బాధ పడుతుంది. తులసి అలా జరుగదు అమ్మ అంటూ తన బాధల గురించి చెబుతుంది. ఇక తులసి తన అమ్మ బాధలు అర్థం చేసుకొని తన తల్లికి క్షమాపణలు చెబుతుంది. కాని తులసి దివ్య విషయంలో అలా చేయడానికి కారణం.. రేపు దివ్య ఓ ఇంటి కోడలు అయినప్పుడు ఇటువంటివి ఎదురు కాకూడదు అన్న ఉద్దేశంతో చేస్తుంది. దానికి దివ్య అర్థం చేసుకుంటుంది.
సీన్ కట్ చేస్తే..
పరంధామయ్య దంపతులు ఇద్దరు చెస్ ఆడుతూ ఉండగా అందులో అనసూయ గెలుస్తూ ఉంటుంది. మరోవైపు తులసి భోజనానికి అన్నీ రెడీ చేసి ఉంచుతుంది. అప్పుడే ప్రవళిక కూడా వచ్చేస్తుంది. ఇక తులసి ప్రవళికతో వెళ్తూ.. అన్ని రెడీ చేశాను అని వాళ్లకు చెబుతుంది. అనసూయ మాత్రం నేను చూసుకుంటాను కదా నువ్వు వెళ్లి ఎంజాయ్ చేయి అని అనడంతో ప్రవళిక వాళ్లను చూసి మురిసిపోతుంది. ఇక వాళ్ళ ని పొగుడుతూ తులసి అదృష్టవంతురాలు అని అంటుంది ప్రవళిక.
తులసి ని బాధ పెట్టిన విషయాన్ని బయట పెట్టిన అనసూయ..
గతంలో అనసూయ తులసిని బాధ పెట్టిన విషయాన్నీ ఓపెన్ గా చెబుతుంది. ఇక ప్రవళికతను అర్థం చేసుకుంటుంది. అప్పుడే దివ్య రావడంతో ప్రవళిక తులసి తనతో బయటకు వస్తుందని చెబుతుంది. ఆ తర్వాత ఇద్దరు ఫ్రెండ్స్ షాపింగ్ మాల్ కు వెళ్లి షాపింగ్ చేస్తారు. ఇక ప్రవళిక తులసి కోసం చుడిదార్ కొని మొత్తానికి తులసితో వేయిస్తుంది. అంతేకాకుండా వాకింగ్ షూట్ కూడా తీసుకుంటుంది. బహుశా ఈసారి తులసి వాకింగ్ షూట్ తో వాకింగ్ చేస్తుందేమో.
Intinti Gruhalakshmi April 30 Episod: రోడ్డు పై చిందులు వేసిన తులసి..
మరోవైపు ప్రేమ్ శృతి ఆరోగ్యం కోసం డబ్బులు అడగటానికి మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్తాడు. ఇక అతడు ప్రేమ్ ఎక్కడ దూరం అవుతాడా అన్న భయంతో మంచివాడిగా నటిస్తూ ప్రేమ్ కు డబ్బులు ఇస్తాడు. తులసి, ప్రవళిక షాపింగ్ పూర్తి చేసుకుని పానీపూరి పందెం కాస్తారు. అందులో తులసి గెలవడంతో రోడ్డుపై చిందులు వేస్తుంది. తరువాయి భాగంలో తులసిని చూసిన నందు కోపంతో రగిలిపోతూ కనిపిస్తాడు.